స్ట్రాబెర్రీలు.ప్రస్తుత సీజన్ లో విరివిరిగా లభ్యమయ్యే పండ్లలో ఒకటి.
స్ట్రాబెర్రీ పండ్లు( Strawberry fruits ) చూపులకు ఆకర్షణీయంగా కనిపించడమే కాదు మంచి రుచిని కలిగి ఉంటాయి.అందుకే చాలామంది ఫేవరెట్ ఫ్రూట్స్ లిస్టులో స్ట్రాబెర్రీలను చేర్చుకుంటారు.
పైగా స్ట్రాబెర్రీ పండ్లు ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తాయి.అనేక జబ్బుల నుంచి రక్షణ కల్పిస్తాయి.
అయితే జుట్టు రాలడాన్ని అడ్డుకోవడంలో కూడా స్ట్రాబెర్రీ పండ్లు అద్భుతంగా సహాయపడతాయి.ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే విధంగా స్ట్రాబెర్రీలను వాడితే హెయిర్ ఫాల్ అన్న మాటే అనరు.
ముందుగా రెండు స్ట్రాబెర్రీ పండ్లను తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న స్ట్రాబెర్రీ పండు ముక్కలు వేసుకోవాలి.అలాగే మూడు టేబుల్ స్పూన్లు పెరుగు,( Curd ) వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ తో పాటు వన్ టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్( Apple Cider Vinegar ) వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.
వారానికి ఒక్కసారి ఈ స్ట్రాబెర్రీ హెయిర్ ప్యాక్ ను కనుక వేసుకుంటే జుట్టు రాలడం క్రమంగా కంట్రోల్ అయిపోతుంది.
స్ట్రాబెర్రీ, పెరుగు, ఆలివ్ ఆయిల్ లో ఉండే ప్రత్యేక సుగుణాలు జుట్టు కుదుళ్లను దృఢంగా మారుస్తాయి.హెయిర్ ఫాల్ సమస్యను కంట్రోల్ చేస్తాయి.హెయిర్ గ్రోత్ ను ప్రోత్సహిస్తాయి.
అలాగే యాపిల్ సైడర్ వెనిగర్ స్కాల్ప్ ను లోతుగా శుభ్రం చేస్తుంది.చుండ్రు, ఇన్ఫెక్షన్స్, దురద తదితర సమస్యలను నివారిస్తుంది.
కాబట్టి హెయిర్ ఫాల్ సమస్యతో తీవ్రంగా సతమతం అవుతున్న వారు తప్పకుండా ఈ స్ట్రాబెర్రీ ప్యాక్ ను ట్రై చేయండి.మంచి రిజల్ట్ ను మీరు గమనిస్తారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy