విజృంభిస్తున్న డెంగ్యూ.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!!

డెంగ్యూ.దోమల వల్ల వ‌చ్చే వ్యాధి ఇది.ఇప్ప‌టికే కంటికి క‌నిపించ‌ని క‌రోనా దెబ్బ‌కు ప్ర‌జ‌లు అత‌లాకుత‌లం అవుతున్నారు.

అయితే ఇదే స‌మయంలో డెంగ్యూ కూడా విజృంభిస్తోంది.

వ‌ర్షాకాలం ప్రారంభం అవ్వ‌డంతో.డెంగ్యూ కేసులు కూడా రోజురోజుకు పెరుగుతున్నాయి.

ప్రతి సంవత్సరం కొన్ని మిలియన్ల మంది డెంగీ జ్వరం బారినపడుతున్నారు.ఈ క్ర‌మంలోనే కొంద‌రు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు.

డెంగ్యూ వ‌స్తే అధిక జ్వరం, తలనొప్పి, వాంతులు, కండరాలు, కీళ్ల నొప్పులు, చర్మపు దద్దుర్లు వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి.వీటిని అశ్రద్ధ చేస్తే మనిషి ప్రాణానికే ముప్పు వాటిల్లే అవకాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి.

Advertisement
How To Prevent From Dengue Fever..?? Dengue Fever, Latest News, Health Tips, Hea

దురదృష్టకర విషయం ఏంటంటే.మిగతా వైరల్ జ్వరాలలాగానే డెంగ్యూను నయం చేసే మందులు ఏవీ లేవు.

How To Prevent From Dengue Fever.. Dengue Fever, Latest News, Health Tips, Hea

కేవ‌లం లక్షణాలను తగ్గించటానికి, రోగనిరోధక వ్యవస్థని పెంచ‌డానికి మాత్ర‌మే మందులు ఇస్తారు.అందుకే డెంగ్యూ విజృంభిస్తున్న వేళ అంద‌రూ త‌గిన‌ జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.డెంగ్యూ వ్యాపించ‌డానికి నీరు ముఖ్య‌పెద్ద పాత్ర పోషిస్తుంది.

ఎందుకంటే నీరు లేకుండా దోమల పెంపకం అసాధ్యం.కాబ‌ట్టి, ఇంటి చుట్టూ నీరు లేకుండా చూసుకోవాలి.

ఇంట్లోకి దోమ‌లు రాకుండా తెరలు ఉప‌యోగించాలి.అలాగే చీకటి పడగానే తలుపులు, కిటికీలు మూసేసుకోవాలి.

రాత్రి భోజ‌నం త‌ర్వాత ఇలా చేస్తే మ‌ల‌బ‌ద్ధ‌కం స‌మ‌స్యే ఉండ‌ద‌ట‌!

మస్కిటో కోయిల్స్‌, ఆల్‌ఔట్ వంటి వాటిని ఉపయోగిస్తే.దోమ‌లను నివారించ‌వ‌చ్చు.

Advertisement

అదేవిధంగా, ఇంటి చుట్టూ పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, ప్లాస్టిక్ వ్యర్థాలు లేకుండా చూసుకోవాలి.ఒంటికి వేప నూనె లేదా కొబ్బ‌రి నూనె రాసుకోవాలి.

ఇక ప్ర‌తిరోజు ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం తీసుకోవ‌డంతో పాటు గోరువెచ్చ‌ని నీటిని కూడా తాగాలి.

తాజా వార్తలు