శీతాకాలంలో జలుబును రాకుండా చేసే ముంద‌స్తు జాగ్ర‌త‌లు ఇవే!

శీతాకాలం రానే వ‌చ్చింది.చ‌లి పులి ప్ర‌జ‌ల‌పై పంజా విసిరేందుకు సిద్ధం అవుతోంది.

ఇక ఈ వింట‌ర్ సీజ‌న్‌లో పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా దాదాపు అంద‌రినీ ప్ర‌ధానంగా ఇబ్బంది పెట్టే స‌మ‌స్య జ‌లుబు.ఎంత దూరంగా ఉందామ‌ని ప్ర‌య‌త్నించినా.

ఏదో ఒక విధంగా జ‌లుబుకు గురై నానా తిప్ప‌లూ ప‌డుతుంటారు.అయితే ఇప్పుడు చెప్ప‌బోయే ముందస్తు జాగ్ర‌త్త‌లు తీసుకుంటే గ‌నుక‌.

వింట‌ర్‌లో వేధించే జ‌లుబుకు దూరంగా ఉండొచ్చు.మ‌రి లేటెందుకు ఆ ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు ఏంటో చూసేయండి.

Cold, Winter Season, Latest News, Health Tips, Health, Good Health, Winter, Win
Advertisement
Cold, Winter Season, Latest News, Health Tips, Health, Good Health, Winter, Win

చ‌లి కాలంలో విట‌మిన్ సి, విట‌మిన్ డి మ‌రియు జింక్ ఉండే ఆహార పదార్ధాల‌ను ఖ‌చ్చితంగా డైట్‌లో చేర్చుకోవాలి.ఎందు కంటే, ఈ పోష‌కాలు రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను బ‌ల‌ప‌రుస్తాయి.త‌ద్వారా జ‌లుబు ద‌రి దాపుల్లోకి రాకుండా ఉంటుంది.

అలాగే ఈ వింట‌ర్ సీజ‌న్‌లో చాలా మంది చ‌ల్ల‌గానే ఉంద‌న్న సాకుతో వాట‌ర్‌ను ఎవైడ్ చేస్తారు.కానీ, వాతావ‌ర‌ణం ఎంత చ‌ల్ల‌గా ఉన్నా రోజుకు క‌నీసం ప‌ది గ్లాసుల వాట‌ర్‌ను సేవించాలి.

మ‌రియు ఉద‌యాన్నే గోరు వెచ్చ‌ని నీటిని త‌ప్ప‌ని స‌రిగా తీసుకోవాలి.అప్పుడే జ‌లుబు, ద‌గ్గు, శ్వాస సంబంధిత స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి.

అపరిశుభ్రమైన ఆహారానికి, నీటికి దూరంగా ఉండాలి.చేతుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!

బ‌య‌ట త‌యారు చేసిన ఆహారాల‌ను తీసుకోవ‌డం పూర్తిగా త‌గ్గించేయాలి.ఇలా చేయడం వల్ల జలుబు రాకుండా సాధ్యమైనంత వరకు కాపాడుకోవచ్చు.

Cold, Winter Season, Latest News, Health Tips, Health, Good Health, Winter, Win
Advertisement

ఇక చెవులలోకి చ‌ల్ల‌టి గాలి వెళ్ల‌కుండా కాట‌న్‌తో క‌వ‌ర్ చేసుకోవాలి.వీలైనంత వరకూ ఆహారాన్ని వేడి వేడిగా తినాలి.పండ్లు, కూరగాయలు, ఆకుకూర‌లు శుభ్రంగా కడిగిన తర్వాతే తీసుకోవాలి.

రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంట‌లు ఖ‌చ్చితంగా నిద్రించాలి.మ‌రియు రెగ్యుల‌ర్‌గా ఇర‌వై, ముప్పై నిమిషాల పాటు వ్యాయామాలు చేయాలి.

ఈ జాగ్ర‌త్త‌ల‌న్నీ తీసుకుంటే జ‌ల‌బు ఒక్క‌టే కాదు ఇత‌ర సీజ‌న‌ల్ వ్యాధులకు కూడా దూరంగా ఉండొచ్చు.

తాజా వార్తలు