నిమ్మ తొక్కలతో నైట్ క్రీమ్.. నిత్యం వాడితే అదిరిపోయే లాభాలు మీ సొంతం!

సాధారణంగా జ్యూస్ తీసిన తర్వాత ఎందుకు పనికి రావని దాదాపు అందరూ నిమ్మ తొక్కలను( Lemon Peel ) బయటకు విసిరేస్తుంటారు.

కానీ నిమ్మరసంలోనే కాదు నిమ్మ తొక్కల్లోనూ విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ మరియు ఫైబర్ అధిక మొత్తంలో ‌ఉంటాయి.

అందువల్ల ఆరోగ్యపరంగా నిమ్మ తొక్కలు అనేక ప్రయోజనాలను చేకూరుస్తాయి.అలాగే చర్మ సౌందర్యాన్ని పెంచడంలో కూడా నిమ్మ తొక్కలు అద్భుతంగా తోడ్పడతాయి.

ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే విధంగా నిమ్మ తొక్కలతో నైట్ క్రీమ్( Night Cream ) తయారు చేసుకుని నిత్యం వాడితే అదిరిపోయే స్కిన్ కేర్ బెనిఫిట్స్ మీ సొంతమవుతాయి.అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక చిన్న కప్పు వాటర్ పోసుకోవాలి.

అలాగే జ్యూస్ తీసిన నాలుగు నిమ్మ చెక్కలను వేసి చిన్న మంటపై దాదాపు పది నుంచి 15 నిమిషాల పాటు ఉడికించాలి.ఆపై స్టవ్ ఆఫ్ చేసుకుని అందులో ఒక కప్పు ఎండిన గులాబీ రేకులు( Dried Rose Petals ) వేసి గంటపాటు వదిలేయాలి.

Advertisement
How To Make Night Cream With Lemon Peel Details, Night Cream, Lemon Peel, Lemon

ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో ఉడికించుకున్న నిమ్మ పండు తొక్కలు మరియు గులాబీ రేకులు వేసుకుని మూడు టేబుల్ స్పూన్లు రోజ్ వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

How To Make Night Cream With Lemon Peel Details, Night Cream, Lemon Peel, Lemon

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో స్మూత్ క్రీమ్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ క్రీమ్ లో వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్,( Aloevera Gel ) హాఫ్ టేబుల్ స్పూన్ గ్లిజరిన్, హాఫ్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేస్తే మన క్రీమ్‌ సిద్ధమవుతుంది.ఈ క్రీమ్ ను బాక్స్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.

రోజు నైట్ ఈ క్రీమ్ ను ముఖానికి అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.

How To Make Night Cream With Lemon Peel Details, Night Cream, Lemon Peel, Lemon

నిత్యం ఈ క్రీమ్ ను వాడటం వల్ల చర్మంపై ఎలాంటి మచ్చలు ఉన్నా సరే క్రమంగా మాయం అవుతాయి.పిగ్మెంటేషన్ సమస్య దూరం అవుతుంది.మొటిమల బెడద తగ్గుతుంది.

Ladies Finger, Reduce Overweight, Overweight, Weight Loss Tips, Benefits Of Ladies Finger For Heal

స్కిన్ టోన్( Skin Tone ) ఇంప్రూవ్ అవుతుంది.బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ రిమూవ్ అవుతాయి.

Advertisement

చర్మం తెల్లగా కాంతివంతంగా మెరుస్తుంది.సహజంగానే అందంగా మెరిసిపోవాలని కోరుకుంటున్న వారికి ఈ క్రీమ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

తాజా వార్తలు