వంటింటి వ్యర్ధాలతో నాణ్యమైన కంపోస్ట్ తయారీ చేసే విధానం..!

ప్రస్తుతం చాలామంది ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని రసాయన మందులు పిచికారి చేయని కూరగాయలు, పండ్లు, ఆహారాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.

కొంతమంది ఇంటి ఆవరణలోనే రకరకాల కూరగాయలు పండిస్తున్నారు.

ఇక ఎరువుల విషయానికి వస్తే సరైన అవగాహన లేక కాస్త ఇబ్బంది పడుతున్నారు.అయితే వంటింటి వ్యర్ధాలతో( Kitchen Waste ) ఇంట్లోనే చాలా సులభంగా నాణ్యమైన కంపోస్ట్ ఎరువు తయారు చేసుకోవచ్చు.

బయట నుండి పశువుల ఎరువులను, సేంద్రియ ఎరువులను కొనాల్సిన అవసరం ఉండదు.అయితే చాలామందికి ఒక డౌట్ రావచ్చు.

ఇంట్లో కంపోస్ట్ ఎరువు( Compost ) తయారు చేసుకుంటే ఈగల, దోమల బెడద పెరిగి అనవసర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయని అనుకుంటారు.కానీ కంపోస్ట్ ఎరువును ఎటువంటి వాసన లేకుండా ఎటువంటి రోగాలు రాకుండా సురక్షితంగా తయారు చేసుకోవచ్చు.

Advertisement

వంటింటి వ్యర్థాలతో ఇంట్లోనే కంపోస్ట్ ఎరువులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం: మూత ఉండే రెండు పెద్ద సైజు ప్లాస్టిక్ బకెట్స్ తీసుకోవాలి.ఆ తర్వాత ప్లాస్టిక్ బకెట్స్ కి వాటి సైదులు బట్టి 15 నుంచి 100 వరకు చిన్నచిన్న రంధ్రాలు చేసుకోవాలి.మూతకు 8 నుంచి 10 వరకు చిన్న రంధ్రాలు( Small Holes ) చేసుకోవాలి.

ఎరువు కుళ్లేటప్పుడు కాస్త వాసన వస్తుంది.ఆ వాసన ఈ రంధ్రాల ద్వారా బయటకు వెళ్తుంది.

ఇంట్లో వ్యర్థాలు అంటే సాధారణంగా కూరగాయల వ్యర్ధాలు, దేవుడికి పెట్టిన పూలు, రకరకాల పండ్ల నుంచి వచ్చే వ్యర్థాలు.వీటిని విడివిడిగా పెట్టుకోవాలి.అడుగు బాగాన ఎండుటాకులు లేదా కొబ్బరి పీచు వేసుకోవాలి.

పీచు రెండు లేదా మూడు అంగుళాలు వేసుకోవాలి.ఇక ఇంట్లో ఉండే కూరగాయల వ్యర్థాలను బకెట్లో ఒక లేయర్ లాగా వేసుకోవాలి.

Marathon: Atención Al Cliente Y Calidad Del Servicio — Guía Práctica Para Jugadores De Arg...
Marathon: Atención Al Cliente Y Calidad Del Servicio — Guía Práctica Para Jugadores De Arg...

ఆ తరువాత వాటిపై పండ్ల వ్యర్థాలను లేయర్ లాగా వేసుకోవాలి.కొన్ని ఎండుటాకులు తీసుకుని మెత్తగా పొడి చేసుకొని వ్యర్ధాలు కనపడకుండా మొత్తం కప్పాలి.

Advertisement

ఇలా ప్రతిరోజు వంటింటి వ్యర్థాలను లేయర్ లాగా బకెట్ నిండే వరకు వేస్తూ ఉండాలి.ఒకసారి ఒక కర్ర తీసుకొని బకెట్లోని వ్యర్ధాలను తిప్పాలి.

ఇక 40 నుంచి 60 రోజుల మధ్యలో కంపోస్టు ఎరువు తయారవుతుంది.

తాజా వార్తలు