నైట్ నిద్రించే ముందు ఈ చాక్లెట్ క్రీమ్ రాస్తే ముఖం మెరిసిపోవ‌డం ప‌క్కా!

ముఖ సౌంద‌ర్యాన్ని పెంచుకోవాల‌నే కోరిక అంద‌రికీ ఉంటుంది.అందుకోస‌మే ఖ‌రీదైన క్రీములు, లోష‌న్లు, మాయిశ్చ‌రైజ‌ర్లు, సీర‌మ్‌లు కొనుగోలు చేసి వాడుతుంటారు.

అయితే మార్కెట్‌లో ల‌భ్య‌మ‌య్యే ప్రోడెక్ట్స్ వ‌ల్ల ప్ర‌యోజ‌నాలు ఎన్ని ఉన్నాయి అన్న‌ది ప‌క్క‌న పెడితే.వాటిలో ఉండే కెమిక‌ల్స్ చ‌ర్మ ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తాయి.

అందుకే న్యాచుర‌ల్ ప‌ద్ధ‌తుల్లోనూ చ‌ర్మాన్ని మెరిపించుకునేందుకు ప్ర‌య‌త్నించాలి.అందుకు ఇప్పుడు చెప్ప‌బోయే చాక్లెట్ క్రీమ్ అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

మ‌రి ఆ చాక్లెట్ ఫేస్ క్రీమ్‌ను ఇంట్లోనే సుల‌భంగా ఎలా త‌యారు చేసుకోవాలి.? మ‌రియు ఏ విధంగా వాడాలి.? వంటి విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక డార్క్ చాక్లెట్‌ను తీసుకుని చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.

Advertisement
How To Make Chocolate Cream For Glowing Skin! Chocolate Cream, Glowing Skin, Lat

ఇప్పుడు చిన్న గిన్నెలో చాక్లెట్ ముక్క‌లు, రెండు టేబుల్ స్పూన్ల రోజ్ వాట‌ర్ వేసి డ‌బుల్ బాయిల‌ర్ మెథ‌డ్‌లో మెల్ట్ చేసుకుని చ‌ల్లార బెట్టుకోవాలి.ఆ త‌ర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో అలోవెర జెల్ నాలుగు టేబుల్ స్పూన్లు, మెల్ట్ చేసి పెట్టుకున్న చాక్లెట్ రెండు టేబుల్ స్పూన్లు, రైస్ బ్రాన్ ఆయిల్ వ‌న్ టేబుల్ స్పూన్ వేసుకుని ఐదు నుంచి ప‌ది నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకుంటే చాక్లెట్ క్రీమ్ సిద్ధ‌మైన‌ట్టే.

ఈ క్రీమ్‌ను ఒక కంటైన‌ర్‌లో నింపుకుని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే.నెల రోజుల పాటు వాడుకోవ‌చ్చు.

How To Make Chocolate Cream For Glowing Skin Chocolate Cream, Glowing Skin, Lat

ఇక ఈ క్రీమ్‌ను ఎలా వాడాలంటే.నైట్ నిద్రించే ముందు ముఖానికి ఉన్న మేక‌ప్ మొత్తాన్ని పూర్తిగా తొల‌గించి వాట‌ర్‌తో ఫేస్ వాష్ చేసుకోవాలి.ఇప్పుడు త‌యారు చేసుకున్న క్రీమ్‌ను ముఖానికి అప్లై చేసి ప‌డుకోవాలి.

ఇలా ప్ర‌తి రోజు చేస్తే గ‌నుక ముఖం ఎల్ల‌ప్పుడూ గ్లోగా, షైనీగా మెరిసి పోతుంటుంది.మ‌రియు ముఖంపై త్వ‌ర‌గా ముడ‌త‌లు, స‌న్న‌ని చార‌లు ఏర్ప‌డ‌కుండా కూడా ఉంటాయి.

Jyothamma Jabardast : మానవత్వం మర్చిపోయిన ఓ సమాజమా ..అగ్గి తో కడగాలి నిన్ను !
Advertisement

తాజా వార్తలు