పిల్లలు చేడు స్నేహాలు చేస్తే ఇలా కనిపెట్టండి

టీనేజ్ లో తల్లిదండ్రులు పిల్లలపై ఎక్కువగా ప్రభావం చూపలేరు.

అయితే యవ్వనంలోకి రాకముందు, లేదా రెండు పదుల వయసు దాటాక తల్లిదండ్రుల మనసుని, మాటని అర్థం చేసుకుంటారు.

టీనేజర్స్ ని ఎక్కువ ప్రభావితం చేసేవి స్నేహాలే.మంచి స్నేహితులు దొరికితే దారిలో ఉంటారు.

అదే చెడు స్నేహాలు చేస్తే అడ్డదారులు తొక్కుతారు.మరి మీ పిల్లలు చేడు స్నేహాలు చేస్తే ఎలా కనిపెట్టాలి? * మాటకి మాట సమాధనం చెప్పడం ఎక్కువ అయిపోతుంటే అన్ని సక్రమంగా జరగట్లేదనే విషయాన్ని గుర్తుంచుకోండి.* స్కూలుకి, కాలేజికి మామూలుగా ఉండే సమయాల్లో కాకుండా, వేరే సమయాల్లో వెళుతున్నట్లు చెప్పడం.

లేట్ గా రావడం, లేదంటే త్వరగానే వచ్చేసి క్లాస్ లేదు, కాలేజ్ లేదు అని చెప్తారు.పిల్లలకు తెలియకుండా వారి చెబుతున్నది నిజమో కాదో కనిపెట్టాలి.* పిల్లల స్నేహితులు ఇంటికి వస్తున్నారో లేదో, సడెన్ గా రావడం మానేసారో, వారి మాటతీరులో, పద్ధతిలో తేడా ఉందో లేదో గమనించండి.

Advertisement

స్నేహితులు తడబడితే ఏదో జరుగుతున్నట్టే.* కుంటుంబంతో ఎక్కువ గడపకపోవడం.

ఒంటరిగా ఉండటానికి ఇష్టపడటం, రాత్రి ఇంటికి ఆలస్యంగా రావడం, చూపులు కలపకుండా మాట్లాడటం .ఇవి జరుగుతుంటే మీ పిల్లలు ఖచ్చితంగా చెడు సాంగత్యంలో ఉన్నట్టే.* ఇంటికి వచ్చిన వెంటనే దూరంగా ఉండి మాట్లాడితే నోటి నుంచి సిగరెట్ వాసన కాని, మద్యం వాసన కాని వస్తోందో లేదో చూడండి.

తరచుగా వక్కపొడి, చూయింగ్ గమ్ నములుకుంటే వస్తే కూడా అనుమానించాల్సిందే.* ఇంట్లోంచి డబ్బులు మాయమవడం తరుచుగా జరిగితే, అది దాదాపుగా టీనేజర్స్ పనే.మీ కంటికి దొరికేలా పథకం వేయండి.తల్లిదండ్రులతో మాటల తగ్గిండంతో మొదలవుతాయి ఇవన్ని.

కాబట్టి మీ పిల్లలకు మీ సమయాన్ని కేటాయించి, వారి సమయాన్ని కొద్దిగా తీసుకోని, వారితో గడపటం అలవాటు చేసుకోవాలి.మరీ ముఖ్యంగా టీనేజిలో ఇది చాలా అవసరం.

ఈ రాశుల వారికి పచ్చ రత్నం కలిసి రాదా..?
Advertisement