నిత్య పూజకి ఎలాంటి విగ్రహాలుండాలి?

సాధారణంగా మనం అనేక రకాల లోహాలతో తయారుచేసిన విగ్రహాలను చూస్తూ ఉంటాం.వీటిలో ఏ లోహంతో చేసినవి పూజలో పెట్టుకోవాలో అర్ధం కాదు.

అయితే అందంగా ఉన్నాయని మార్కెట్ లో దొరికే చెక్క,మట్టి విగ్రహాలను నిత్య పూజలో ఉపయోగించకూడదు.అయితే మట్టి విగ్రహాలను వినాయచవితి,దసరా పండుగలలో పూజిస్తాం కదా అనే అనుమానం రావచ్చు.

How To Keep Idols In Pooja Room , Pooja Room, Vinayachavithi, The Festival Of Du

ఎందుకు నిత్య పూజలో మట్టి విగ్రహాలను పెట్టుకోకూడదో తెలుసుకుందాం.మట్టి విగ్రహాలను వినాయచవితి,దసరా పండుగలలో పూజించి ఆ తర్వాత నిమజ్జనం చేసేస్తాం.

కానీ ప్రతి రోజు పూజిస్తే వాటికీ పగుళ్లు వస్తాయి.పగుళ్లు వచ్చిన విగ్రహాలకు పూజలు చేయకూడదు.

Advertisement

అందువల్ల బంగారం, వెండి, ఇత్తడి, కంచు లోహాలతో తయారయిన విగ్రహాలను పూజలో పెట్టి పూజలు చేయవచ్చు.అయితే ఈ విగ్రహాలు చిన్నగా ఉండాలి.

గణపతిని మాత్రమే రాగితో తయారుచేసింది పూజించవచ్చు.స్ఫటిక విగ్రహాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి.కానీ అవి మిగలకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి.

ఉగ్ర స్వరూపం వున్న విగ్రహాలను పూజించకూడదు.చిన్ముద్రతో, అభయ హస్తంతో ఆశీర్వదిస్తున్నట్లుండే విగ్రహాలను పూజిస్తే మంచి జరుగుతుంది.

మనం నమస్కారం చేసి కళ్ళు తెరవగానే ఇటువంటి విగ్రహాలను చూస్తే మనకి ఎనలేని ప్రశాంతత,ఎక్కడలేని ధైర్యం లభిస్తాయి.

బూతు సినిమాలు మళ్లీ తెలుగు తెరను ఏలనున్నాయా?
Advertisement

తాజా వార్తలు