ప్రోస్టేట్ క్యాన్సర్ ని ముందస్తుగా ఎలా గుర్తించాలో తెలుసా..?

ఇండియాలో వివిధ రకాల క్యాన్సర్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతుంది.ఈ ప్రమాదకరమైన వ్యాధి శరీరంలో అనేక అవయవాలకు కూడా సోకవచ్చు.

అయితే క్యాన్సర్ ను ( Cancer ) ముందుగానే గుర్తిస్తే దాన్ని సులువుగా నయం చేసుకోవచ్చు.కానీ సరైన అవగాహన లేకపోతే లక్షణాలను నిర్లక్ష్యం చేయడం వలన ముప్పు ముంచుకొస్తోంది.

ప్రస్తుతం ఇండియాలో ముఖ్యమైన ఆరోగ్య సమస్యల్లో ప్రోస్టేట్ క్యాన్సర్( Prostate Cancer ) కూడా ఒకటి.దేశంలో ఇది అత్యంత సాధారణ రకం క్యాన్సర్ గా ఉంది.

సంవత్సరానికి సుమారు 34,500 కొత్త కేసులు నమోదవుతున్నాయి.కాబట్టి ఈ వ్యాధిని ముందుగానే గుర్తించాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Advertisement

ప్రొస్టేట్ క్యాన్సర్ అనేది వివిధ స్థాయిల తీవ్రతతో కూడిన సంక్షిప్త వ్యాధి.

దీనికి అన్ని సందర్భాల్లో తక్షణ చికిత్స చేయవలసిన అవసరం లేదు.ఇక ప్రొస్టేట్ క్యాన్సర్స్ సోకే రిస్క్‌ ఎక్కువగా ఉన్న వాళ్లని గుర్తించడం, ముందస్తుగా గుర్తించడం వల్ల కలిగే ప్రయోజనాలు, నష్టాలకు సంబంధించి వారికి తగిన కౌన్సెలింగ్ అందించడాన్ని ప్రొస్టేట్ క్యాన్సర్ స్క్రీనింగ్( Prostate Cancer Screening ) అంటారు.అయితే స్క్రీనింగ్ సరైన సమయం ఫ్రీక్వెన్సీ లేదా బయాప్సీ ఇంటర్వెల్స్ పై ప్రస్తుతం ఖచ్చితమైన సమాచారం లేదు.

అయినా అత్యధిక కేసులకు రెగ్యులర్ స్క్రీనింగ్ చాలా అవసరం.ప్రోస్టేట్ క్యాన్సర్ ను ముందస్తుగా గుర్తించడానికి ఒక వ్యక్తి మొత్తం ఆరోగ్యం కొమొర్బిడిటీస్‌, లైఫ్‌ ఎక్స్‌పెక్టెన్సీ, రోగి ప్రాధాన్యతలను పరిగణనలోకి తీసుకోవాలి.

ఇక అనవసరమైన చికిత్సలను తగ్గించడానికి జీవన నాణ్యతను పెంచడానికి ఫిజికల్ ఎగ్జామినేషన్, మెడికల్ హిస్టరీ, టార్గెట్ స్క్రీనింగ్ లాంటి పద్దతులను ఉపయోగించి రోగి ప్రత్యేక కారకాల ఆధారంగా కేసును విశ్లేషించడం చాలా అవసరం.ప్రొస్టేట్ క్యాన్సర్‌కు సంబంధించిన ఇనీషియల్‌ ఎవాల్యువేషన్‌లో హిస్టరీ, ఫిజికల్ ఎగ్జామినేషన్‌ ఉంటాయి.ప్రొస్టేట్ క్యాన్సర్ ఫ్యామిలీ హిస్టరీ, ఇతర క్యాన్సర్‌లకు సంబంధించి పర్సనల్ హిస్టరీ, హై-రిస్క్‌ జెనిటిక్‌ మ్యూటేషన్స్‌, ఆఫ్రికన్ మూలాలను తెలుసుకుంటారు.

మీరు 11 వ తారీఖున జన్మించారా....అయితే మీ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా?
Advertisement

తాజా వార్తలు