వయసును తగ్గించే గోధుమలు.. ఇలా వాడితే మీ అందం రెట్టింపు అవ్వాల్సిందే!

గోధుమలు( Wheat ).వీటి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు.

ప్రపంచవ్యాప్తంగా బియ్యంతో పాటు గోధుమల వినియోగం కూడా భారీగా ఉంది.

అయితే గోధుమలు ఆరోగ్యానికి మాత్రమే కాదు అందాన్ని పెంచడానికి కూడా అద్భుతంగా సహాయపడతాయి.

గోధుమల్లో విటమిన్ ఈ, జింక్ వంటి పోషకాలు మెండుగా నిండి ఉంటాయి ఇవి మన వయసును తగ్గించి చూపిస్తాయి.అందాన్ని రెట్టింపు చేస్తాయి.

అనేక స్కిన్ కేర్ బెనిఫిట్స్ ను చేకూరుస్తాయి.మ‌రి ఇంతకీ గోధుమలను చర్మానికి ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ముందుగా గోధుమ‌ల‌ను పిండి చేసి స్టోర్ పెట్టుకోవాలి.లేదా మార్కెట్ లో మ‌న‌కు ఎల్ల‌ప్పుడూ గోధుమపిండి అందుబాటులోనే ఉంటుంది.దాన్ని కూడా తెచ్చుకోవ‌చ్చు.

ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు గోధుమ పిండి వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్, రెండు టేబుల్ స్పూన్లు పెరుగు( Curd ), వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ తేనె( Honey ) వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇలా త‌యారు చేసుకున్న‌ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని ఇర‌వై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై చర్మాన్ని సున్నితంగా స్క్రబ్బింగ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

వారానికి రెండు సార్లు ఈ రెమెడీని పాటించడం వల్ల చర్మంపై ఏమైనా ముడతలు ఉంటే మాయం అవుతాయి.సాగిన చర్మం టైట్ గా మారుతుంది.

మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన బాలకృష్ణ.. ఏంటో తెలుసా?
మొదటి సినిమాతోనే రికార్డ్ లు బ్రేక్ చేయాలని చూస్తున్న స్టార్ హీరో కొడుకు..?

అలాగే చర్మం పై మృత కణాలు తొలగిపోతాయి.ఓపెన్ పోర్స్ క్లోజ్ అవుతాయి.చర్మం ఎల్లప్పుడూ అందంగా, గ్లోయింగ్ గా మెరుస్తుంది.

Advertisement

మరియు డ్రై స్కిన్ సమస్య సైతం దూరం అవుతుంది.కాబట్టి వయసు పై బ‌డిన అందంగా యవ్వనంగా మెరిసిపోవాలని కోరుకునే వారు తప్పకుండా ఈ రెమెడీని ట్రై చేయండి.

తాజా వార్తలు