కేవలం 4 బాదంలతో మచ్చలేని మెరిసే తెల్లటి చర్మాన్ని మీ సొంతం చేసుకోండిలా!

బాదం పప్పు( Almonds ) ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో.ఎన్ని ప్రయోజనాలను చేకూరుస్తుందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు.

ఖరీదు కాస్త ఎక్కువే అయినప్పటికీ.బాదం పప్పులో అందుకు తగ్గ పోషకాలు మెండుగా నిండి ఉంటాయి.

అయితే ఆరోగ్యానికి మాత్రమే కాదు అందాన్ని పెంచడానికి కూడా బాదం పప్పు గ్రేట్ గా హెల్ప్ చేస్తుంది.అవును, కేవలం నాలుగు బాదం పప్పులతో మచ్చలేని మెరిసే తెల్లటి చర్మాన్ని మీ సొంతం చేసుకోవచ్చుమ‌రి ఇంత‌కీ బాదం ప‌ప్పుల‌ను చ‌ర్మానికి ఎలా ఉప‌యోగించాలో ఆల‌స్యం చేయ‌కుండా తెలుసుకుందాం ప‌దండి.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో నాలుగు బాదం పప్పులు వేసి వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు నానబెట్టుకున్న బాదం పప్పులను తొక్క తొలగించి మిక్సీ జార్ లో వాటర్ సహాయంతో స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.

How To Get Spotless White Shiny Skin With Almonds , Almonds, Almonds Face P
Advertisement
How To Get Spotless White Shiny Skin With Almonds , Almonds, Almonds Face P

ఇలా గ్రైండ్ చేసుకున్న బాదం మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ రోజ్ పెటల్స్ పౌడర్( Rose petals powder ), పావు టేబుల్ స్పూన్ పసుపు ( Turmeric )వేసుకొని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతల అప్లై చేసుకుని ప‌దిహేను లేదా ఇర‌వై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై వాటర్ తో చర్మం శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

How To Get Spotless White Shiny Skin With Almonds , Almonds, Almonds Face P

రెండు రోజులకు ఒకసారి ఈ సింపుల్ హోమ్ రెమెడీని పాటిస్తే అద్భుతాలు జరుగుతాయి.బాదం పప్పులో ఉండే విటమిన్ ఈ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చర్మాన్ని తేమగా కాంతివంతంగా మారుస్తాయి.మొండి మచ్చలను మాయం చేస్తాయి.

స్కిన్ టోన్ ను క్ర‌మంగా పెంచుతాయి.అలాగే గులాబీ రేకుల పొడిలో ఉండే పోషకాలు చర్మాన్ని స్మూత్ గా, షైనీగా మారుస్తాయి.

ఇక పసుపు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుప‌రుస్తుంది.మొత్తంగా ఈ రెమెడీతో మచ్చలేని మెరిసే తెల్లటి చ‌ర్మం మీ సొంతం అవుతుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
Advertisement

తాజా వార్తలు