నైట్ మిగిలిపోయిన రైస్ తో ఇలా చేస్తే మచ్చలేని మెరిసే చర్మం మీ సొంతం!

నైట్ వండిన‌ రైస్ మిగిలి పోయిందా.? ఆ రైస్ ఎందుకు పనికి రాదని డస్ట్ బిన్ లోకి తోస్తున్నారా.

? అయితే ఇకపై మాత్రం అలా చేయకండి.నైట్ మిగిలిపోయిన రైస్ తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

ముఖ్యంగా చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడానికి రైస్ అద్భుతంగా సహాయపడుతుంది.నైట్ మిగిలిపోయిన రైస్ తో ఇప్పుడు చెప్పబోయే విధంగా చేస్తే మచ్చలేని మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది.

అందుకోసం ముందుగా ఒక చిన్న బీట్ రూట్ ను తీసుకొని పీల్ తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే చిన్న బంగాళదుంప( Potato ) తీసుకుని తొక్క చెక్కేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి.

How To Get Spotless White Glowing Skin With Leftover Rice Spotless Skin, White

ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న బీట్ రూట్( Beetroot ) ముక్కలు, బంగాళదుంప ముక్కలు, రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు నైట్ మిగిలిపోయిన రైస్, ఐదారు టేబుల్ స్పూన్లు రోజ్ వాటర్ వేసుకుని స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్, రెండు టేబుల్ స్పూన్లు పచ్చిపాలు( Milk ) వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

How To Get Spotless White Glowing Skin With Leftover Rice Spotless Skin, White
Advertisement
How To Get Spotless White Glowing Skin With Leftover Rice? Spotless Skin, White

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు కాస్త మందంగా అప్లై చేసుకోవాలి.ఆపై చర్మాన్ని ఇర‌వై నిమిషాల పాటు ఆరబెట్టుకుని.అప్పుడు వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

ఈ రెమెడీని తరచూ పాటిస్తూ ఉంటే చర్మం తెల్లగా కాంతివంతంగా మారుతుంది.చర్మం పై ఎలాంటి మచ్చలు ఉన్నా సరే క్రమంగా మాయం అవుతాయి.

మచ్చలేని మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది.అంతేకాదు చర్మం పై పేరుకుపోయిన మురికి, మృత కణాలు సైతం తొలగిపోతాయి.

ముఖ చర్మం క్షణాల్లో గ్లోయింగ్ గా, షైనీ గా మెరుస్తుంది.కాబట్టి మిగిలిపోయిన రైస్ ను డస్ట్ బిన్ లోకి తోసేయకుండా ఇలా చర్మ సౌందర్యాన్ని పెంచుకునేందుకు ఉపయోగించుకోండి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021
Advertisement

తాజా వార్తలు