ప్రసవం తర్వాత పొట్టపై స్ట్రెచ్ మార్క్స్ అసహ్యంగా కనిపిస్తున్నాయా? అయితే ఇలా చేయండి!

సాధారణంగా ప్రతి మహిళ ప్రసవం అనంతరం ఎదుర్కొనే సమస్యల్లో స్ట్రెచ్ మార్క్స్( Stretch marks ) ఒకటి.

ప్రెగ్నెన్సీ సమయంలో కడుపులో ఉన్న బేబీ కారణంగా పొట్ట బాగా సాగుతుంది.

దానివల్ల ప్ర‌స‌వం అనంతరం పొట్టపై స్ట్రెచ్ మార్క్స్ అసహ్యంగా కనిపిస్తుంటాయి.వీటిని వదిలించుకోవడం కోసం చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తుంటారు.

కొందరైతే ట్రీట్మెంట్ కూడా చేయించుకుంటారు.కానీ సహజంగానే ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు.

అందుకు ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ క్రీమ్( Home made cream ) సూపర్ గా హెల్ప్ చేస్తుంది.మరి ఇంతకీ స్ట్రెచ్ మార్క్స్ ను వదిలించే ఆ క్రీమ్ ను ఎలా తయారు చేసుకోవాలి అన్నది ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ముందుగా ఒక బౌల్‌ తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్( Aloevera gel ) వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ వాసెలిన్, వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్, హాఫ్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకుని స్పూన్ సహాయంతో కనీసం ఐదు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలి.తద్వారా మన క్రీమ్ సిద్ధమవుతుంది.

ఈ క్రీమ్ ను ఒక బాక్స్ లో నింపుకుని స్టోర్ చేసుకోవాలి.

రోజు ఉదయం స్నానం చేయడానికి గంట ముందు మరియు నైట్ నిద్రించే ముందు ఈ క్రీమ్ ను పొట్టపై అప్లై చేసి కనీసం ప‌ది నిమిషాలు అయినా వేళ్ళతో సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.ఈ హోమ్ మేడ్ క్రీమ్ ను రోజుకు రెండు సార్లు రెగ్యులర్ గా వాడితే కేవలం కొద్ది రోజుల్లో స్ట్రెచ్ మార్క్స్ మాయం అవుతాయి.అలాగే పొట్ట వద్ద చర్మం టైట్ గా సైతం మారుతుంది.

కాబట్టి స్ట్రెచ్ మార్క్స్ సమస్యతో ఎవరైతే తీవ్రంగా మదన పడుతున్నారో వారు తప్పకుండా ఈ హోమ్ మేడ్ క్రీమ్ ను తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!
Advertisement

తాజా వార్తలు