చలికాలంలో వేధించే చ‌ర్మ‌ దుర‌ద‌ల‌కు ఇలా చెక్ పెట్టేయండి!

చ‌లి కాలం ప్రారంభం అవుతోంది.ఈ సీజ‌న్‌లో ప్ర‌ధానంగా వేధించేది చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌లే.

అందులోనూ దుర‌దలు మ‌రీ ఎక్కువ‌గా ఇబ్బంది పెడ‌తాయి.వాతావ‌ర‌ణంలో వ‌చ్చే మార్పుల కార‌ణంగా చ‌ర్మం పొడిగా మారి దుర‌ద‌ పెడుతూ ఉంటుంది.

దాంతో ఏం చేయాలో స‌రైన అవ‌గాహ‌న లేక ర‌క‌ర‌కాల క్రీములు వాడ‌తారు.అయితే ఇప్పుడు చెప్ప‌బోయే టిప్స్‌ను పాటిస్తే.

చ‌లికాలంలో వేధించే చ‌ర్మ‌ దుర‌ద‌ల‌కు సుల‌భంగా చెక్ పెట్ట‌వ‌చ్చు.మ‌రి ఇంకెందుకు లేటు ఆ టిప్స్ ఏంటో చూసేయండి.

Advertisement
How To Get Rid Of Skin Itching In Winter! Skin Itching, Skin Care, Skin Care Tip

జామ ఆకులు.ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి.అలాగే చ‌ర్మ దుర‌ద‌ల‌ను సైతం నివారిస్తాయి.

అందుకు ముందు ఒక బౌల్‌లో రెండు గ్లాసుల వాట‌ర్ తీసుకుని.అందులో ఒక స్పూన్ కొబ్బ‌రి నూనె మ‌రియు ఫ్రెష్‌గా ఉండే కొన్ని జామ ఆకుల‌ను తుంచి వేయాలి.

వాట‌ర్ స‌గం అయ్యే వ‌ర‌కు మ‌రిగించి.ఆపై చ‌ల్లార‌నివ్వాలి.

కోపాన్ని అదుపులోకి తెచ్చే బెస్ట్ టిప్స్ మీకోసం?

ఇప్పుడు వాట‌ర్‌ను ఫిల్ట‌ర్ చేసి స్ప్రే బాటిల్‌లో నింపి.దుర‌ద వ‌స్తున్న ప్రాంతంలో స్ప్రే చేసుకోవాలి.

Advertisement

ఇలా చేస్తే దుర‌ద‌లు త‌గ్గ‌డ‌మే కాదు.చ‌ర్మం తేమ‌గా కూడా ఉంటుంది.

చలికాలంలో ఇబ్బంది పెట్టే చ‌ర్మ దుర‌ద‌ల‌ను నారింజ పండు తొక్కలు త‌గ్గించ‌గ‌ల‌దు.చర్మంపై దురదలుగా అనిపించినప్పుడు నారంజ‌ పండ్ల తొక్కలతో రుద్దితే.

వెంటనే ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

How To Get Rid Of Skin Itching In Winter Skin Itching, Skin Care, Skin Care Tip

వింట‌ర్‌లో చ‌ర్మ దుర‌ద‌ల‌కు దూరంగా ఉండాలంటే.గోరు వెచ్చని నీటి స్నానం చేసి ఆపై చ‌ర్మానికి పెట్రోలియం జెల్లీని పూసుకోవాలి.టాల్కం పౌడర్లను ఈ సీజ‌న్‌లో ఎంత ఎవైడ్ చేస్తే అంత మంచిది.

అలాగే స్నానము చేసే నీటిలో కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసి చేస్తే.చ‌ర్మ దుర‌ద‌లు త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.

మురియు స్కిన్ డ్రై అవ్వ‌కుండా తేమ కూడా ఉంటుంది.ఇక ఈ సీజ‌న్‌లో సాధార‌ణ స‌బ్బుల కంటే గ్లిజరిన్‌ సబ్బులు వాడాలి.

త‌ద్వారా చ‌ర్మం పొడిబార‌కుండా ఉంటుంది.

తాజా వార్తలు