బయట సుమ వయసు ఎంత అంటే చెప్పలేకపోతున్నారు.. సీరియల్ నటుడు కామెంట్స్ వైరల్?

బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు ప్రసారం అవుతూ ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని అందిస్తున్నాయి.ఈ క్రమంలోనే సుమ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమవుతున్న క్యాష్ ప్రోగ్రాం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

 We Cant Say How Old The Suma Is Serial Actor Comments Viral, Anchor, Suma, Age,-TeluguStop.com

గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం విశేషమైన ప్రేక్షకాదరణ పొంది దూసుకుపోతోంది.ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన తాజా ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు.

ఈ ప్రోమోలో భాగంగా ఓ సీరియల్ నటుడు సుమను దారుణంగా అవమానించారు.ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ క్రమంలోనే ఈ ప్రోమోలో భాగంగా ఈ కార్యక్రమానికి సీనియర్ ఆర్టిస్టులు అయిన సమీర్, రామ్ జగన్, రాఘవ, రాజీవ్ కనకాల హాజరయ్యారు.ఇక ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేముందు సుమా మాట్లాడుతూ.

ఇవాళ క్యాష్ ఆడబోతున్నారు ఆల్ అంకుల్స్ అని చెప్పడంతో ఒక్కసారిగా వీరందరూ షాక్ అయ్యారు.ఈ సందర్భంగా సీరియల్ నటుడు రామ్ జగన్ మాట్లాడుతూ.

సుమ నీకు నాకు వన్ ఇయర్ మాత్రమే డిఫరెన్స్.ఈ డిఫరెన్స్ కే అంకుల్ అనేస్తారా అంటూ ప్రశ్నించారు.

ఇలా సుమ వయసు గురించి సీరియల్ నటుడు మాట్లాడటంతో సుమా స్పందిస్తూ మీకు మెమరీ లాస్ వచ్చింది అనడానికి పరాకాష్ఠ ఇది అని తెలిపారు.

మీకు నాకు ఒక సంవత్సరం తేడా ఏంటండి 21 సంవత్సరాలు తేడా ఉంటుంది.అని సుమ అనగా అందుకు సీరియల్ నటుడు రామ్ జగన్ మాట్లాడుతూ బయట సుమ వయసు ఎంత ఉంటుందని అడగడంతో చెప్పలేకపోతున్నామని ఆమె వయసు పై కామెంట్ చేశారు.ఈ క్రమంలోనే మిగతా నటుల గురించి కూడా సుమ తనదైన శైలిలో కామెంట్ చేశారు.

ఏదో లేటుగా పిల్లలు పుట్టారు కానీ మీరందరూ కూడా అంకుల్స్ అంటూ కామెంట్ చేశారు.ఇక రాజీవ్ కనకాల విషయానికి వచ్చే సరికి ఇదిగో చెబుతున్నాను వినండి మా ఆయనను అంకుల్ అని మాత్రం అనకండి.

ఎందుకంటే ఆయనని అంకుల్ అంటే నేను ఆంటీ అవుతా కనుక అలా పిలవద్దు అంటూ తనదైన శైలిలో చమత్కారం చేశారు.ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అయింది.

Worlds Longest Name with Thousand Letters Creates Guinness Book Record

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube