చలికాలంలో మోకాళ్ళ‌ నొప్పులు మరింత ఇబ్బంది పెడుతున్నాయా.. ఎండు ఖర్జూరంతో తరిమికొట్టండిలా!

మోకాళ్ళ నొప్పులు( Knee Pains ). ఇటీవల కాలంలో ఎంతో మందిని మద‌న పెడుతున్న సమస్య ఇది.

మోకాళ్ళ నొప్పుల వల్ల కాసేపు నడవాలన్నా, నిలబడాలన్నా, మెట్లు ఎక్కాలన్నా చాలా ఇబ్బంది పడుతుంటారు.అందులోనూ ప్రస్తుతం చలికాలంలో మోకాళ్ళ నొప్పులు మరింత ఎక్కువగా బాధకు గురి చేస్తాయి.

ఈ క్రమంలోనే మోకాళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం పొందడం కోసం పెయిన్ కిల్లర్స్ వేసుకుంటారు.అయితే వాటి వల్ల తాత్కాలిక ఉపశమనం మాత్రమే కలుగుతుంది.కానీ కొన్ని కొన్ని ఆహారాలు మోకాళ్ళ నొప్పులను శాశ్వతంగా వదిలించగలవు.

How To Get Rid Of Knees Pain With Dried Dates, Dried Dates, Dried Dates Health

అలాంటి వాటిలో ఎండు ఖర్జూరాలు( Dried Dates ) ఒకటి.ఇవి మోకాళ్ళ నొప్పులను తరిమి కొట్టి ఎముకలను బలోపేతం చేయడానికి అద్భుతంగా తోడ్పడతాయి.మరి ఇంతకీ ఎండు ఖర్జూరాలను ఎలా తీసుకోవాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement
How To Get Rid Of Knees Pain With Dried Dates?, Dried Dates, Dried Dates Health

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో నాలుగు నుంచి ఐదు ఎండు ఖర్జూరాలు వేసుకోవాలి.అలాగే ఐదు బాదం పప్పులు వేసి వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.

మరుసటి రోజు మిక్సీ జార్ తీసుకుని అందులో నానబెట్టుకున్న ఎండు ఖర్జూరాలను గింజ తొలగించి వేసుకోవాలి.అలాగే బాదం పప్పులు( Almonds ) కూడా పొట్టు తొలగించి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ ఆవు పాలు పోసుకోవాలి.పాల్ కాస్త హీట్ అయ్యాక పావు టీ స్పూన్ పసుపు, అంగుళం దాల్చిన చెక్క వేసి నాలుగు నిమిషాల పాటు మరిగించాలి.

ఆ తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండు ఖర్జూరం, బాదం మిశ్రమాన్ని వేసి మరో నాలుగు నిమిషాల పాటు ఉడికించాలి.

How To Get Rid Of Knees Pain With Dried Dates, Dried Dates, Dried Dates Health
ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021

ఆపై స్టవ్ ఆఫ్ చేసి తయారు చేసుకున్న డ్రింక్ ను సర్వ్ చేసుకుని గోరువెచ్చగా అయిన తర్వాత సేవించాలి.ఇది బోన్ బూస్టర్ డ్రింక్( Bone Booster Drink ) లాగా ప‌ని చేస్తుంది.రోజుకు ఒకసారి ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల ఎముకల్లో సాంద్రత పెరుగుతుంది.

Advertisement

బలహీనమైన ఎముకలు( Bones ) దృఢంగా మారతాయి.మోకాళ్ళ నొప్పులు పరార్ అవుతాయి.

నిత్యం ఈ డ్రింక్ ను తీసుకుంటే మోకాళ్ళ నొప్పులు అన్న మాటే అనరు.కాబట్టి తప్పకుండా ట్రై చేయండి.

తాజా వార్తలు