జలుబు చేసిందా.. వంటింట్లో ఉండే మెంతులతో తరిమి కొట్టండిలా!

ప్రస్తుత వింటర్ సీజన్ లో( Winter ) చాలా కామన్ గా ఇబ్బంది పెట్టే సమస్యల్లో జలుబు( Cold ) ముందు వరుసలో ఉంటుంది.

జలుబు చిన్న సమస్యే అయినప్పటికీ తీవ్రమైన అసౌకర్యానికి గురి చేస్తుంది.

ఈ క్రమంలోనే జలుబు నుంచి రిలీఫ్ పొందటానికి రకరకాల మందులు వాడుతుంటారు.అయితే సీజనల్ జలుబు నివారణకు మన వంటింట్లోనే ఎన్నో ఔషధాలు ఉన్నాయి.

అందులో మెంతులు( Fenugreek Seeds ) కూడా ఒకటి.జలుబు మరియు ఇతర శ్వాసకోశ సమస్యలను దూరం చేయడానికి మెంతులు చాలా అద్భుతంగా తోడ్పడతాయి.

రోజుకు రెండుసార్లు మెంతి టీ( Fenugreek Tea ) తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు.అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేసి అర కప్పు వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.

Advertisement

మరుసటి రోజు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అయ్యాక నానబెట్టుకున్న మెంతులను నీటితో సహా వేసుకుని పది నుంచి ప‌న్నెండు నిమిషాల పాటు మరిగిస్తే టీ రెడీ అవుతుంది.

టీను ఫిల్టర్ చేసుకుని గోరువెచ్చగా అయ్యాక సేవించాలి.

జలుబు చేసినప్పుడు మెంతి టీ రోజులో ఒకటి లేదా రెండుసార్లు తీసుకుంటే త్వరగా ఉప‌శ‌మ‌నం పొందుతారు.మెంతుల్లో ఉండే యాంటీ-వైరల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు జలుబు మరియు ఫ్లూ వంటి సమస్యను చాలా వేగంగా తరిమి కొడతాయి.మెంతి టీ ను రెగ్యులర్ డైట్ లో కూడా చేర్చుకోవచ్చు.

మెంతి టీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయప‌డుతుంది.

రిజెక్ట్ చేయడానికి నేను సినిమా కథలు వింటాను... విశ్వక్ సేన్ సంచలన వ్యాఖ్యలు!
ఆస్పిరిన్‌ టాబ్లెట్స్‌ తరచుగా తీసుకుంటున్నారా.. అయితే ప్రమాదంలో పడ్డట్లే..

మెంతి టీలో ఉండే శ‌క్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు మ‌ద్ద‌తు ఇస్తాయి.అలాగే కొవ్వు పదార్ధాల నుండి కొలెస్ట్రాల్‌ను శరీరం గ్రహించడాన్ని తగ్గించడంలో మెంతి టీ తోడ్ప‌డుతుంది.అంతేకాకుండా శ‌రీర బ‌రువు నిర్వాహ‌ణ‌లో, నెల‌స‌రి నొప్పుల‌ను దూరం చేయ‌డంలో, లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో కూడా మెంతి టీ అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

Advertisement

తాజా వార్తలు