వయస్సు మచ్చల నివారణకు ఇంటి పరిష్కారాలు

సాదారణంగా వయస్సు మచ్చలను లివర్ స్పాట్స్ లేదా సూర్యుడు మచ్చలు అని పిలుస్తారు.చర్మం మీద సూర్యుని కిరణాలు ఎక్కువగా పడటం వలన ఈ మచ్చలు సంభవిస్తాయి.

కాలేయం పనితీరు మందగించడం లేదా పోషక లోపం వంటి కారణాల వలన కూడా ఈ మచ్చలు వస్తాయి.సాదారణంగా ఈ మచ్చలు ముఖం, మెడ మరియు చేతుల మీద వస్తాయి.

ఈ మచ్చలు ప్రమాదకరం కాదు.అయితే మచ్చ రంగులో కానీ ఆకారంలో కానీ మార్పులు ఉంటే మాత్రం వైద్యున్ని సంప్రదించాలి.

1.బంగాళాదుంప

వయస్సు మచ్చలను తగ్గించటంలో బంగాళాదుంప చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.బంగాళాదుంపను పేస్ట్ గా చేసి ప్రభావిత ప్రాంతంలో రాస్తే వయస్సు మచ్చల చికిత్సలో సహాయపడుతుంది.

2.కలబంద జెల్

కలబంద జెల్ వయస్సు మచ్చల చికిత్సలో ఒక సమర్థవంతమైన ఇంటి నివారిణి అని చెప్పవచ్చు.

కలబంద జెల్ ని ప్రభావిత ప్రాంతంలో రాసి 45 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.ప్రతి రోజు రెండు సార్లు రాస్తే మంచి పలితాన్ని పొందవచ్చు.

3.పసుపు

పసుపు కూడా వయస్సు మచ్చలను తగ్గించటంలో సహాయపడుతుంది.పసుపులో పాలను కలిపి పేస్ట్ గా తయారుచేయాలి.

Advertisement

ఈ పేస్ట్ ని ప్రభావిత ప్రాంతంలో రాయాలి.ప్రతి రోజు రెండు సార్లు మూడు వారాల పాటు రాస్తే మంచి పలితాన్ని పొందవచ్చు.

4.పచ్చి బొప్పాయి

చల్లని పచ్చి బొప్పాయి ముక్కతో ప్రభావిత ప్రాంతంలో రుద్ది 25 నిమిషాల తర్వాత చలల్ని నీటితో శుభ్రం చేసుకోవాలి.ప్రతి రోజు ఈ విధంగా చేస్తూ ఉంటే వయస్సు మచ్చలు తగ్గటంలో సహాయపడుతుంది.

5.ఆముదం

ఆముదం వయస్సు మచ్చలను తగ్గించటంలో చాలా బాగా సహాయపడుతుంది.ప్రతి రోజు రెండు సార్లు ఆముదంతో ప్రభావిత ప్రాంతంలో మసాజ్ చేయాలి.

ఈ విధంగా చేస్తే వయస్సు మచ్చల సమస్య నుండి త్వరగా ఉపశమనం పొందటానికి సహాయపడుతుంది.పది వారాల పాటు ఈ విధంగా చేస్తే మంచి పలితాన్ని పొందవచ్చు.

Advertisement

తాజా వార్తలు