ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు జుట్టు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు.
చాలా చిన్న వయస్సులోనే తెల్ల జుట్టు రావటం,జుట్టు పలుచన అవ్వటం, జుట్టు రాలటం వంటి సమస్యలు వస్తున్నాయి.
మారిన జీవనశైలి, కాలుష్యం,ఒత్తిడి, జుట్టుకు సరైన పోషకాలు లభించకపోవటం వలన జుట్టు సమస్యలు వస్తున్నాయి.ఈ సమస్యల నుండి బయట పడటానికి ఒక చిన్న చిట్కా ఉంది.
మనం రోజు ఉపయోగించే టీ పొడి ఈ సమస్యలకు పరిష్కారం.టీ లో ఉండే పోషకాలు ఆరోగ్యానికి సహాయపడటమే కాకుండా జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది.కాఫీతో పోలిస్తే కెఫీన్ టీ లో ఎక్కువగా ఉంటుంది.కెఫీన్ జుట్టు సమస్యలను పరిష్కారం చేయటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.అలాగే టీ లో ఉండే పోషకాలు,యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టు సమస్యలను తగ్గిస్తాయి.
జుట్టు తెల్లగా మారే సమస్యను తగ్గించటమే కాకుండా జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగటానికి సహాయపడుతుంది.దీని కోసం ఏమి చేయాలో చూద్దాం.
ఒక గ్లాస్ నీటిలో నాలుగు స్పూన్ల టీ పొడిని వేసి బాగా మరిగించాలి.ఈ నీరు చల్లారాక వడకట్టాలి.
ఈ వడకట్టిన నీటిని జుట్టు కుదుళ్లకు బాగా పట్టించాలి.పది నిమిషాల పాటు మసాజ్ చేస్తే తలలో రక్త ప్రసరణ బాగా జరిగి జుట్టు ఆరోగ్యంగా పెరగటానికి సహాయపడుతుంది.
ఒక గంట తర్వాత చల్లని నీటిలో తలస్నానము చేయాలి.ఇలా వారానికి రెండు సార్లు చేయటం వలన తెల్ల జుట్టు నల్లగా మారటాన్ని గమనించవచ్చు.
అలాగే జుట్టు రాలే సమస్య,చుండ్రు,జుట్టు చిట్లే సమస్యలు కూడా దూరం అవుతాయి.ఒకవిధంగా చెప్పాలంటే టీ పొడి మీ జుట్టుకు మంచి కండిషనర్ గా పనిచేస్తుంది.
వారానికి రెండు సార్లు ఈ విధంగా చేయటం వలన ఒత్తైన నిగనిగలాడే జుట్టు మీ సొంతం అవుతుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy