సుమన్ చేయాల్సిన ఆ సినిమా బాలయ్య దగ్గరికి ఎలా వెళ్ళింది...

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది హీరోల్లో ఒకప్పటి స్టార్ హీరో అయిన సుమన్( Suman ) ఒకరు ఈయన చేసిన చాలా సినిమాలు అప్పట్లో పెద్ద హిట్లు గా నిలిచాయి.

నిజానికి ఈయన ఇండస్ట్రీ లో ఒక స్టార్ హీరో గా మంచి గుర్తింపు పొందాలి కానీ ఈయన అనవసరంగా ఒక కేసు లో ఇరుక్కొని ఆయన కెరియర్ ని నాశనం చేసుకున్నారు.

నిజానికి ఈయన చేసిన సినిమాలు చాలా అద్భుతంగా ఉండేవి అప్పట్లో చాలా అందం గా కూడా ఉండేవారు.అలాంటి సుమన్ ఇండస్ట్రీ లో చాలా సినిమాలు చేసి ఇండస్ట్రీ ని శాశించే స్థాయి కి వెళ్తాడు అని అనుకున్నారు, కానీ అదంతా ఏమి జరగలేదు.

How Suman Missed Balakrishna Rowdy Inspector Movie Details, Suman, Hero Suman ,b

ఇక సుమన్ గారు అసలు ఇండస్ట్రీ కి వస్తానని కూడా అనుకోలేదట ఎందుకంటే ఆయనకి సినిమా ఇండస్ట్రీ అంటేనే అప్పట్లో పెద్దగా ఇంట్రెస్ట్ లేదట కానీ తాను మార్షల్ ఆర్ట్స్( Martial Arts ) నేర్చుకోవడం చూసిన తన ఫ్రెండ్ సినిమాల గురించి చెప్పి తనని ఎంకరేజ్ చేయడం తో ఆయన ఇండస్ట్రీ కి వచ్చారు.అయితే ఇండస్ట్రీ లో అంచెలంచేలు గా ఎదుగుతూ వచ్చారు.అయితే సుమన్ గారు చేయాల్సిన ఒక సినిమా బాలయ్య బాబు చేసారు అదేం సినిమా అంటే రౌడీ ఇన్స్పెక్టర్.( Rowdy Inspector Movie )

How Suman Missed Balakrishna Rowdy Inspector Movie Details, Suman, Hero Suman ,b

ఈ సినిమా మొదట సుమన్ దగ్గరికి వెళ్లిందట ఆయన కొంచం బిజీ గా ఉండటంతో ఈ సినిమా మళ్లీ బాలయ్య( Balakrishna ) దగ్గరికి వెళ్ళింది బాలయ్య ఈ సినిమా చేసి ఒక బిగెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడనే చెప్పాలి.అయితే బాలయ్య బాబు చేయాల్సిన ఒక సినిమా సుమన్ చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు అదేం సినిమా అంటే బావ బామ్మరిది సినిమా.ఈ సినిమా మొదట బాలయ్య బాబు దగ్గరికి వెళ్లినప్పటికీ ఆ స్టోరీ నచ్చక బాలయ్య ఆ సినిమాని రిజక్ట్ చేయడం తో సుమన్ ఆ సినిమా చేసి మంచి హిట్ కొట్టాడు.

Advertisement
How Suman Missed Balakrishna Rowdy Inspector Movie Details, Suman, Hero Suman ,b
Ladies Finger, Reduce Overweight, Overweight, Weight Loss Tips, Benefits Of Ladies Finger For Heal

తాజా వార్తలు