రజినీకాంత్ చేయాల్సిన రేలంగి మామయ్య రోల్.. ఎలా మిస్ అయ్యింది

2023లో విడుదలైన ఫ్యామిలీ డ్రామా ఫిలిం "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు"( Seethamma Vakitlo Sirimalle Chettu ) బ్లాక్ బాస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

మిక్కీ J.

మేయర్ కంపోజ్ చేసిన, అనంత శ్రీరామ్, సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన ఇందులోని పాటలు ఎవర్ గ్రీన్ హిట్స్ అయ్యాయి.ఈ మూవీలో మహేష్ బాబు,( Mahesh Babu ) వెంకటేష్( Venkatesh ) హీరోలుగా నటించారు.

సమంత, అంజలి హీరో హీరోయిన్లుగా యాక్ట్ చేశారు.వీరందరి క్యారెక్టర్లు బాగా హిట్ అయ్యాయి.

అయితే ఈ సినిమాలో హీరో హీరోయిన్ల క్యారెక్టర్ల కంటే మరొక క్యారెక్టర్ బాగా హైలైట్ అయింది.ఇప్పటికీ అది మీమ్స్ లో బాగా కనిపిస్తుంది.

Advertisement

ఆ క్యారెక్టర్ మరేదో కాదు రేలంగి మావయ్య.( Relangi Mavayya ) ఇందులో టాలెంటెడ్ యాక్టర్ ప్రకాష్ రాజ్( Prakash Raj ) అద్భుతంగా నటించాడు.

రేలంగి మామయ్య క్యారెక్టర్ రాముడు మంచి బాలుడు లాంటిది.అందరినీ ఆప్యాయంగా పలకరించడం, వీలైతే ఒకరికి మంచి చేయడం, పిల్లలను వారికి నచ్చినట్లు పెంచడం తప్ప చెడు చేయడం ఈ రోల్‌కు తెలియదు ఇంత మంచి క్యారెక్టర్ ముందుగా ప్రకాష్ రాజు వద్దకు రాలేదట.ఈ రోల్‌ కి సూపర్ స్టార్ రజనీకాంత్( Rajinikanth ) పర్ఫెక్ట్ గా సూట్ అవుతాడని దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల భావించాడు.అందుకే మొదట రజనీకాంత్ ని ఆశ్రయించాడు.40 నిమిషాల పాటు రజనీకి స్టోరీ కూడా వినిపించాడు.ఆ తర్వాత "సాటి మనిషిని చూడగానే నవ్వుతూ ముందుకు వెళ్లిపోయే ఒక మంచి క్యారెక్టర్ కి నన్నే ఎందుకు తీసుకోదల్చుకున్నావు?" అని రజనీకాంత్ ప్రశ్నించాడట.

అప్పుడు శ్రీకాంత్ అడ్డాల సమాధానం చెబుతూ "సార్ ఈ క్యారెక్టర్ అనేది రిక్షావాడి నుంచి కోటీశ్వరుడి వరకు కనెక్ట్ కావాలి.మీరు చేస్తేనే అది సాధ్యమవుతుంది.అందుకే మీ వద్దకు వచ్చాను" అని చెప్పాడట.

అయితే రజనీకాంత్ కి ఈ క్యారెక్టర్ బాగా నచ్చేసిందట.కానీ ఆ సమయంలో తనకు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండటం వల్ల షూటింగ్‌లో ఎక్కువ సేపు పాల్గొనలేనని చెప్పి, దాన్ని సున్నితంగా రిజెక్ట్ చేశాడని సమాచారం.

Amerio Erfahrungen Und Reputation : Eine Analytische Einordnung
Shuffle : Analyse De L’expérience Mobile Et Des Paiements...

రజనీకాంత్ ఎలాంటి క్యారెక్టర్ లోనైనా అద్భుతంగా సెట్ అవ్వగలడు.ఆయన ఈ క్యారెక్టర్ చేసుంటే వేరే లెవెల్ లో సినిమా ఉండేది.

Advertisement

అలాగని ప్రకాష్ రాజ్‌ మంచిగా చేయలేదని కాదు.ఆయన చేయడం వల్లే ఈ క్యారెక్టర్ ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తిండి పోయింది.

రజనీకాంత్ చేసుంటే ఇంకొంచెం హైలెట్ అయి ఉండేదేమో.

తాజా వార్తలు