ఏ వయసు వారు ఎంత నీటిని తాగాలి.. పసిపిల్లలకు ఏ నెల నుంచి వాటర్ పట్టాలి..?

మానవ మనుగడలో నీరు( Water ) అత్యంత కీలకపాత్రను పోషిస్తుంది.ఆహారం లేకపోయినా మనిషి చాలా రోజులు జీవించగలడు.

కానీ నీరు లేకపోతే మాత్రం జీవించడం చాలా కష్టం.మన శరీరం 70 శాతం నీటితో నిర్మితమై ఉండటం వల్ల ముఖ్యమైన పనులు దాని ద్వారానే జరుగుతాయి.

శరీరానికి నీటిని అందించడం మానేస్తే మనిషి మొదటి రోజే నీరసంగా మారిపోతాడు.మూడో రోజుకు శరీరంలోని అవయవాలన్నీ దెబ్బ తినడం స్టార్ట్ అవుతాయి.

అందుకే ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి సరిపడా నీటిని అందించడం చాలా ముఖ్యం.అయితే సరైన‌ అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది నీటిని ఎలా పడితే అలా తాగేస్తుంటారు.

Advertisement

కొందరు చాలా తక్కువగా వాట‌ర్ ను తీసుకుంటే.కొందరు ఆరోగ్యానికి( Health ) మంచిదనే కారణంతో అతిగా తాగుతుంటారు.

ఫలితంగా లేనిపోని సమస్యలు తలెత్తుతాయి.ఈ నేపథ్యంలోనే ఏ వయసు వారు ఎంత నీటిని తాగాలి.? పసి పిల్లలకు( Infants ) ఏ నెల నుంచి వాటర్ పట్టడం ప్రారంభించాలి.? అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

16 నుంచి 60 సంవత్సరాలు మధ్య ఉన్న స్త్రీలు మరియు పురుషులు రోజుకు నాలుగు నుంచి ఐదు లీటర్ల నీటిని కచ్చితంగా తీసుకోవాలి.60 సంవత్సరాలు నిండిన వారు రోజుకు మూడు నుంచి నాలుగు లీటర్ల వాట‌ర్ ను తాగాలని నిపుణులు చెబుతున్నారు.16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు రోజుకు తప్పనిసరిగా మూడు లీటర్ల నీటిని సేవించాలి.10 సంవత్సరాలు మరియు అంతకంటే తక్కువ వయసు ఉన్న పిల్లల చేత రోజుకు రెండు లీటర్ల నీటిని తాగించ‌డం తల్లిదండ్రుల బాధ్యత.

అలాగే 70 సంవత్సరాలు పైబడిన వారు మూడు లీటర్ల నీటిని తీసుకోవడం మంచిది.ఇక పసిపిల్లలకు మొదటి ఆరు నెలలు నీటిని పాటించాల్సిన అవసరం లేదు.శిశువుకు నీరు ఇవ్వడం వారి ఆరోగ్యానికి హానికరం.

తెలుగు లో ఈ ఇద్దరు దర్శకులకు మాత్రమే 100% సక్సెస్ రేట్ ఉందా..?
మీడియా రంగంలోకి రాబోతున్న నాగబాబు.. ఇక జన సేనకు తిరుగుండదు?

ఆరు నెలల ముందు నవజాత శిశువు హైడ్రేటెడ్ గా ఉండటానికి తల్లి పాలు మాత్రమే అవసరం.అయితే ఘన ఆహారాలు ప్రారంభించిన తర్వాత మీరు చిన్న భాగాలలో నీటిని అందించవచ్చు.

Advertisement

తాజా వార్తలు