గ్లాసు కూల్ డ్రింక్స్ లో ఎంత చక్కెర ఉంటుంది.. శరీరంపై దీని ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా..!

సాధారణంగా ఎండాకాలం వచ్చిందంటే చల్లని ఆహార పదార్థాలు ఉపయోగం పెరుగుతుంది.వీటిలో శీతల పానీయాల వినియోగం మరింత పెరుగుతుందని కచ్చితంగా చెప్పవచ్చు.

శీతల పానీయల రుచి అందరికి ఎంతో నచ్చుతుంది.శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం శీతల పానీయాలు ఆరోగ్యపరంగా అసలు మంచివి కావు.

శీతల పానీయాలు తీసుకోవడం వల్ల శరీరంలో చక్కెర శాతం పెరుగుతుంది.దీని ప్రభావం ఆరోగ్యం పై ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

శీతల పానీయాలను అధికంగా తీసుకోవడం వల్ల వేగంగా బరువు పెరుగుతారు.శీతల పానీయాలలో చక్కెర అధికంగా ఉంటుంది.

Advertisement

అంతేకాకుండా అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలు ఎదురవుతాయి ఒక గ్లాసు శీతల పానీయాలలో ఎనిమిది నుంచి పది టీస్పూన్ల చక్కెర ఉంటుంది.చల్లని పానీయాలు తాగడం వల్ల ఆహారంలో అధిక చక్కెర తీసుకున్నట్లు అవుతుంది.

ఇది ఆరోగ్యానికి ఏ విధంగానూ మంచిది కాదు.ఒక గ్లాసు శీతల పానీయాల లో దాదాపు 150 కేలరీలు ఉంటాయి.

ప్రతి రోజు ఇలా కేలరీలు తీసుకోవడం వల్ల త్వరగా బరువు పెరిగే అవకాశం ఉంది.దీని వల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి.శీతల పానీయాలను మోతాదుకు మించి తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

శీతల పానీయాలలో రెండు రకాల చక్కెరలు ఉంటాయి.మొదటిది గ్లూకోస్.

మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!

ఇది శరీరంలోకి త్వరగా కలిసిపోతుంది.రెండోది ప్రక్టోజ్ ఇది కాలేయంలో నిల్వ అవుతుంది.

Advertisement

ప్రతి రోజు శీతల పానీయాలు తాగడం వల్ల ఇది కాలేయంలో అధికంగా పెరిగిపోయి కాలేయ సంబంధిత సమస్యలు వస్తాయి.ఇంకా చెప్పాలంటే శీతల పానీయాలలో చక్కర పరిమాణం చాలా అధికంగా ఉంటుంది.కాబట్టి దాని వినియోగం మధుమేహం సమస్యలను కూడా పెంచే అవకాశం ఉంది.

శీతల పానీయాలలో ఎక్కువగా తీసుకోవడం వల్ల దంత సమస్యలు వచ్చే అవకాశం ఉంది.కాబట్టి ఎండాకాలంలో శీతల పానీయాలను తీసుకోకపోవడమే మంచిది.

తాజా వార్తలు