మహా భారతంలోని పర్వాలెన్ని? ఎందులో ఏముంటుంది?

మహా భారతంలో మొత్తం 18 పర్వాలు ఉన్నాయి.అందులో మొదటిది ఆది పర్వం, ఇందులో కురువంశ కథ, రాకుమారుల జననం, విద్యాభ్యాసం గురించి వివరించబడి ఉంటుంది.

రెండో సభా పర్వం.ఇందులో కురసభా రంగం, మయసభ, పాచికల ఆట, పాండవుల ఓటమి, రాజ్య భ్రష్టత గురించి ఉంటుంది.

మూడోది వన పర్వం లేక అరణ్య పర్వం.ఇందులో పాండవులు 12 సంవత్సరాల పాటు చేసిన అరణ్య జీవనం గురించి వివరించబడి ఉంటుంది.

నాలుగోది విరాట పర్వం.ఇందులో విరాట రాజు కొలువులో పాండువులు ఏడాది పాటు చేసిన అజ్ఞాత వాసం గురించి ఉంటుంది.

Advertisement
How Many Parvas In Mahabharata Details, Mahabharatham, Mahabharatham Parvas, Tot

ఐదోది ఉద్యోగ పర్వం.అందులో కౌరవ పాండవ సంగ్రామానికి సన్నాహాలు ఉంటాయి.

ఆరోది భీష్మ పర్వం.ఇందులో భీష్ముని నాయకత్వంలో సాగిన యుద్ధం గురించి ఉంటుంది.

ద్రోణ పర్వం.ఇందులో ద్రోణుని నాయకత్వంలో సాగిన యుద్ధం గురించి ఉంటుంది.

ఎనిమిదోది కర్ణ పర్వం.ఇందులో కర్ణుని నాయకత్వంలో సాగిన యుద్ధం గురించి వివరించబడింది.

ఇండియా గొప్పదా? పాకిస్థాన్ గొప్పదా? ఆతిథ్యంపై కెనడా వ్యక్తిని అడిగితే.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..
ఉత్తరాంధ్ర భద్రాద్రి రామతీర్థం గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

తొమ్మిదోది శల్య పర్వం.ఇందులో శల్యుడు సారథిగా సాగిన యుద్ధం గురించి ఉంటుంది.

Advertisement

పదోది సౌప్తిక పర్వం.ఇందులో నిదురిస్తున్న ఉప పాండవులను అశ్వత్థామ వధించడం గురించి ఉంటుంది.

పదకొండోది స్త్రీ పర్వం.ఇందులో గాంధారి మొదలగు స్త్రీలు, మరణించిన వారికోసం రోదించడం ఉంటుంది.

పన్నెండోది శాంతి పర్వం.ఇందులో యుధిష్టరుని రాజ్యాభిషేకం, భీష్ముని ఉపదేశాలు ఉంటాయి.

పదమూడోది అనుశాసనిక పర్వం.ఇందులో భీష్ముని చివరి ఉపదేశాలు ఉంటాయి.పద్నాలుగవది అశ్వమేధ పర్వం.

ఇందులో యుధిష్టరుని అశ్వమేధ యాగం గురించి ఉంటుంది.పదిహేనవది అశ్రమవాస పర్వం.

ఇందులో ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి ప్రభృతులు చివరి రోజులు ఆశ్రమ వాసులుగా గడపడం గురించి ఉంటుంది.పదహారవది మౌసల పర్వం.

ఇందులో యదువంశంలో ముసలం, అంతః కలహాల గురించి ఉంటుంది.పదిహేడవది మహా ప్రస్థానిక పర్వం.

ఇందులో పాండవుల స్వర్గ ప్రయాణ ఆంరంభం గురించి ఉంటుంది.పద్దెనిమిదవది స్వర్గారోహణ పర్వం.

ఇందులో పాండువులు స్వర్గాన్ని చేరడం గురించి ఉంటుంది.

తాజా వార్తలు