రోజుకు ఎన్ని గుడ్లు తినాలంటే..?!

కోడిగుడ్డు అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు.ఎందుకంటే కోడి గుడ్డు రుచితో పాటు, ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది.

గుడ్డులో అనేక రకాల పోషకపదార్థాలు పుష్కలంగా ఉంటాయి.అయితే చాలామంది ఉదయం పూట టిఫిన్ లో భాగంగా ప్రతోరోజు గుడ్డు ఉండేలా చూసుకుంటారు.

ఎందుకంటే గుడ్డులో ఉండే తక్కువ కేలరీలు ఉంటాయి.అవి మన శరీరంలో ఉన్న కొవ్వును తగ్గించి మన శరీర బరువును తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే రోజులో అసలు ఎన్ని గుడ్లు ఆహారంలో భాగం చేసుకోవాలి.అసలు ఒకరోజులో ఎన్ని గుడ్లు తినాలి.? అనే విషయాలు తెలియవు.అందుకనే ఈరోజు ఆ విషయాలను తెలుసుకుందాం.! గుడ్డు ఆరోగ్యానికి మంచిదే.

Advertisement
How Many Eggs Do You Want To Eat Per Day, Eggs, Proteins, 1r 2 Daily, Healthy, H

కానీ, ఏది అయినాగాని మితంగా తీసుకుంటేనే మంచిది. గుడ్డు ఆరోగ్యానికి మంచిది అన్నాము కదా అని ఒకేసారి, ఒకేరోజు ఎక్కువ గుడ్లు తీసుకుంటే ఆరోగ్యం మాట దేవుడెరుగు.

మీరు అనారోగ్యం తెచ్చుకోవడం మాత్రం ఖాయం.పోషకాహార నిపుణుల సర్వే ప్రకారం ఒక గుడ్డులో 200 మి.

గ్రాముల కొవ్వు మాత్రమే ఉంటుందట.ఈ కొవ్వును తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎలాంటి ఇబ్బంది ఉండదట.

అలాగే ఈ కొవ్వు తీసుకోవడం వలన గుండె పై ఎలాంటి భారం అనేది ఉండదట.అంతేకాక గుడ్డులో విటమిన్ ఏ,డి విటమిన్లతో పాటు బయోటెన్ వంటివి పుష్కలంగా ఉంటాయి.

How Many Eggs Do You Want To Eat Per Day, Eggs, Proteins, 1r 2 Daily, Healthy, H
ప్రతిరోజూ 30నిమిషాలు నడిస్తే ఈ వ్యాధులకు చెక్

అందువల్లే గుడ్డుని మీ డైట్ లో భాగంగా చేసుకోవాలని నిపుణులు సలహా ఇస్తారు.ఐతే రోజులో 1 లేదా 2 గుడ్లు మాత్రమే తినాలట.అది మాత్రమే ఆరోగ్యానికి బాగా పనిచేస్తుందట.

Advertisement

మరీ ఎక్కువ గుడ్లు తినడం వల్ల శరీరం పై నెగెటివ్ ప్రభావం పడుతుంది.ముఖ్యంగా గుడ్డులో అధిక ప్రోటీన్ ఉంటుంది.

కాబట్టి ఎక్కువ గుడ్లు తినడం వలన గుడ్డులో ఉండే అధిక ప్రోటీన్ ప్రభావం కిడ్నీలపై పడుతుంది.అందుకే రోజుకి ఒకటి లేదా రెండు గుడ్లు మాత్రమే తినాలి.

ఏది ఏమైనా గాని మీరు డైట్ లో ఉన్నప్పుడు గుడ్డుని మీ డైట్ లో భాగంగా తీసుకోవాలా.? వద్దా.? అనే విషయాన్నీ ఒకసారి మీ శారీరక నిపుణిడిని సంప్రదించి తినడం మంచిది.

తాజా వార్తలు