వామ్మో.. 6 గంటల్లోనే రైల్వే స్టేషన్ రెడీ.. జపాన్ 3D ప్రింటింగ్ టెక్నాలజీ అదుర్స్!

జపాన్ రైల్వే కంపెనీ ( JR West ) సంచలనానికి తెరలేపింది.

అరిడా సిటీలో ప్రపంచంలోనే మొట్టమొదటి 3D ప్రింటెడ్ రైల్వే స్టేషన్‌ను( 3D Printed Railway Station ) కట్టేసి చరిత్ర సృష్టించింది.

హట్సుషిమా స్టేషన్( Hatsushima Station ) పేరుతో పిలిచే ఈ కొత్త కట్టడం రైల్వే నిర్మాణ రంగంలో సరికొత్త టెక్నాలజీకి నిదర్శనం.నిజానికి ఇక్కడ 1948లో కట్టిన పాత చెక్క స్టేషన్ ఉండేది.

అది శిథిలావస్థకు చేరడంతో దాన్ని తీసేశారు.పాత స్టేషన్ 2018 నుంచే ఆటోమేటిక్‌గా పనిచేస్తున్నా, రోజుకి దాదాపు 530 మంది ప్రయాణికులు వచ్చి వెళ్లేవారు.

హట్సుషిమా స్టేషన్ చిన్న రైలు లైన్‌లో ఉండటంతో గంటకు ఒకటి, రెండు సార్లు మాత్రమే రైళ్లు తిరుగుతుంటాయి.ఈ స్టేషన్ నిర్మాణానికి JR వెస్ట్, సెరెండిక్స్ అనే కన్‌స్ట్రక్షన్ కంపెనీతో జతకట్టింది.

Advertisement
How Japan Built A 3d Printed Train Station In 6 Hours-వామ్మో.. 6 �

స్టేషన్‌ను కాంక్రీట్ ముక్కలతో రెడీ చేశారు.వీటిని అరిడాకు 804 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుమామోటో ఫ్యాక్టరీలో 3D ప్రింటింగ్ టెక్నాలజీతో తయారు చేశారు.

ఈ కాంక్రీట్ భాగాలను ప్రింట్ చేయడానికి ఏకంగా ఏడు రోజులు పట్టింది.ఆ తర్వాత వాటిని ట్రక్కుల్లో తీసుకొచ్చి మార్చి 24న స్టేషన్ కట్టే చోటుకు చేర్చారు.

How Japan Built A 3d Printed Train Station In 6 Hours

స్టేషన్ కట్టే పనులు మొదలుపెట్టడానికి ముందే పక్కా ప్లానింగ్ చేసుకున్నారు.రైలు పట్టాల దగ్గర పనులు చేసేటప్పుడు భద్రత చాలా ముఖ్యం కాబట్టి, రాత్రి రైళ్ల రాకపోకలు ఆగిపోయే వరకు వెయిట్ చేశారు.రాత్రి 11:57 నిమిషాలకు లాస్ట్ ట్రైన్ వెళ్లగానే యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలుపెట్టారు.క్రేన్ సాయంతో ఒక్కో కాంక్రీట్ భాగాన్ని తీసుకొచ్చి అతికించారు.

కేవలం ఆరు గంటల్లోనే 100 చదరపు అడుగుల స్టేషన్ రూపుదిద్దుకుంది.ఉదయం 5:45 గంటలకు ఫస్ట్ ట్రైన్ వచ్చేసరికి స్టేషన్ రెడీ అయిపోయింది.

How Japan Built A 3d Printed Train Station In 6 Hours
చలికాలం పొడిచర్మం ఇబ్బందా ? ఈ సలహాలు చూడండి

ప్రస్తుతానికి మెయిన్ బిల్డింగ్ మాత్రమే రెడీ అయింది.టికెట్ మిషన్లు, ఐసీ కార్డ్ రీడర్లు వంటివి ఇంకా పెట్టాల్సి ఉంది.స్టేషన్ మాత్రం జులైలో ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది.

Advertisement

సాధారణ పద్ధతిలో స్టేషన్ కట్టాలంటే కనీసం రెండు నెలలు పట్టేదని, ఖర్చు కూడా రెట్టింపు అయ్యేదని JR వెస్ట్ తెలిపింది.జపాన్‌లో జనాభా తగ్గిపోవడం, వృద్ధుల సంఖ్య పెరిగిపోవడంతో ఇలాంటి ఫాస్ట్ టెక్నాలజీలతో తక్కువ ఖర్చుతో పనులు చేసుకోవచ్చని అంటున్నారు.

"తక్కువ మంది కార్మికులతోనే పనులు ఎలా చేయొచ్చో ఈ ప్రాజెక్ట్ చూపిస్తుంది" అని JR వెస్ట్ ఇన్నోవేషన్స్ ప్రెసిడెంట్ ర్యో కవామోటో చెప్పారు.

తాజా వార్తలు