అనుకోకుండా నటుడిగా మారిన ప్రముఖ సినీ రచయిత.. ఆయన చలువే..?

మూవీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన చాలా మంది టెక్నీషియన్లు ఏదో ఒక సందర్భంలో ముఖానికి మేకప్ వేసుకుంటారు.వీరిలో కొందరు తమలోని అద్భుతమైన నటుడిని బయటపడుతుంటారు.

తదనంతరం టెక్నీషియన్ వర్క్‌కు మాత్రమే పరిమితం కాకుండా నటుడిగా కూడా కొనసాగుతుంటారు.అలాంటి వారిలో ప్రముఖ సినీ రచయిత గొల్లపూడి మారుతీరావు( Gollapudi Maruthi Rao ) ఒకరు.

ఈ రచయిత చిరంజీవి, మాధ‌వి హీరో హీరోయిన్లుగా వచ్చిన ఇంట్లో రామ‌య్య వీధిలో కృష్ణ‌య్య( Intlo Ramayya Veedilo Krishnayya ) సినిమాతో వెండితెరకు సుపరిచితుడయ్యాడు.ఫస్ట్ మూవీలో అదిరిపోయే యాక్టింగ్ స్కిల్స్ ప్రదర్శించి వావ్ అనిపించాడు.

జోక్ ఏంటంటే, ఈ సినిమా ఆయ‌న క్యారెక్టర్ చుట్టే తిరుగుతుంది.ఈ మూవీలో చిరంజీవి( Chiranjeevi ) భార్య మాధవికి( Madhavi ) పొరుగింటి వ్యక్తిలాగా గొల్లపూడి మారుతీరావు నటించారు.

Advertisement

మాధవిపై ఆయన కన్నేసి ఆమె జీవితాన్ని పాడు చేయాలని చూస్తాడు.ఇలాంటి నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో ఆయన చాలా సహజంగా నటించేసి విమర్శకుల చేత కూడా ప్రశంసలు అందుకున్నారు.

ఇంత బాగా నటించడానికి కారణం యువ వయసులో ఆయన చాలా నాటిక‌లు, నాట‌కాల్లో యాక్ట్ చేసి నటన నైపుణ్యాలను సాధించాడు.నిజం చెప్పాలంటే స్టూడెంట్ గా ఉన్నప్పుడు చాలా సమయం స్టేజిమీదే నాట‌కాలు వేస్తూ రాణించాడు.

ఇంతకీ "ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య" సినిమాలో కీలక రోల్ పోషించే అవకాశం గొల్లపూడి మారుతి రావుకి ఎలా వచ్చింది? కోడి రామకృష్ణ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని కె.రాఘ‌వ నిర్మించాడు.రాఘవ త‌రంగిణి సినిమాని( Tarangini ) కూడా నిర్మించాడు.

అయితే దానికి గొల్ల‌పూడే కథ అందించాడు.ఆ సమయంలో రాఘవతో ఆయనకి పరిచయం ఏర్పడింది.

బన్నీ, విష్ణు పక్కనున్న ఈ బుడ్డోడు ఎవరో తెలుసా.. ఈ సీరియల్ నటుడిని గుర్తు పట్టలేరుగా!
హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది... ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!

అయితే త‌రంగిణి కథను నాట‌కానుభ‌వంతో చదివి వినిపించడం, ఒక్కో పాత్ర ఎలా ఉంటుందో నటించి చూపించడం చూసి రాఘవ ఫిదా అయిపోయారు.ఆయనలో మంచి నటుడు ఉన్నాడని గుర్తించాడు.

Advertisement

అందుకే ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాలోని సుబ్బారావు అనే కీలకపాత్రను పోషించమని విజ్ఞప్తి చేశారు.రాఘవ మాటను కాదనలేక గొల్లపూడి మారుతీ రావు నటించారు.ఈ మూవీ చూశాక చాలామంది దర్శకుల దృష్టి గొల్లపూడి పై పడింది.

దర్శకుడు కాంతి కుమార్ "ఇది పెళ్లంటారా?"( Idi Pellantara ) ఈ సినిమాలో ఒక డిఫరెంట్‌ పాత్రను ఇచ్చారు.అందులో కూడా గొల్లపూడి అదరగొట్టారు.

దీని తర్వాత ఆయనకు దర్శకులు వరుసగా సినిమా అవకాశాలను అందించారు.కట్ చేస్తే ఆయన కొంతకాలంలోనే బిజియస్ట్ స్టార్ అయిపోయారు.

తాజా వార్తలు