సింహాద్రి అప్పన్నకు గరుడసేవ ఎలా జరిగిందంటే.. తిరుమలలో భక్తుల కష్టాలు..

విశాఖ జిల్లాలోని సింహాచలం అప్పన్నకు గరుడసేవ ఎంతో వైభవంగా దేవాలయ అధికారులు నిర్వహించారు.

అర్చకులు వేకువజామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ఆనాటి పూజలు సాంప్రదాయ బద్దంగా నిర్వహించారు.

దేవస్థాన వేద పండితులు వేదమంత్రాల నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రవేత్తంగా పలు అర్చితా సేవలు సేవలను కూడా ఎంతో వైభవంగా చేశారు.అర్చకులు స్వామివారిని స్వరంగా సుందరంగా అలంకరించి గరుడవేదికపై స్వామివారిని అధిష్టింపజేసి వేదమంత్రాలు నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ గరుడ సేవను చాలామంది భక్తులు తరలివచ్చి ఎంతో ఘనంగా వైభవంగా నిర్వహించారు.

ప్రత్యక్షంగా, పరోక్షంగా భక్తులు శ్రీ స్వామివారి అర్జిత సేవలలో పాల్గొన్నందుకు సంతోషించారు.తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రతిరోజు ఎంతో మంది భక్తులు వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకుని వస్తూ ఉంటారు.

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు ఉచిత దర్శనం కోసం దాదాపు 13 గంటలకు పైగా వేచి ఉండవలసి వస్తోంది.

Advertisement
How Garuda Seva Happened To Simhadri Appanna , Simhadri Appanna, Garuda Seva ,d

నిన్న రాత్రి 7 గంటలకు వచ్చిన భక్తులకు ఇవాళ ఉదయం 10 గంటల వరకు దర్శనం కావడం లేదు అంటే ఎక్కడ పరిస్థితి ఎలాగా ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు.

How Garuda Seva Happened To Simhadri Appanna , Simhadri Appanna, Garuda Seva ,d

కనీస దర్శనం ఎప్పుడు అవుతుందో కూడా అక్కడి దేవాలయ అధికారులు చెప్పడం లేదని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.నిన్న రాత్రి 7 గంటల నుంచి ఉదయం వరకు ఉచిత దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు టీ,పాలు కూడా ఇవ్వలేదని భక్తులు బాధపడుతున్నారు.ఒకవైపు వర్షం మరోవైపు చలిగాలులతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తీవ్రమైన చలిగాలులు వణికిస్తుంటే భక్తులు ఇబ్బంది పడుతున్నారు అన్న విషయాన్ని గుర్తించకపోవడం బాధాకరమని చెబుతున్నారు.భక్తులకు సౌకర్యాలు కల్పించే విషయంలో తిరుమల దేవస్థానం అధికారుల తీరును నిరసిస్తూ ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు స్వామివారిని దర్శించుకోకుండానే వెను తిరుగుతున్నారంటే పరిస్థితి ఎలాగా ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు.

Victory Venkatesh : హీరోయిన్లతో గొడవ పడుతున్న స్టార్ హీరో....మాటలు కూడా లేవట?
Advertisement

తాజా వార్తలు