నిద్ర మాత్ర ఎలా పనిచేస్తుంది? వేసుకోగానే నిద్ర ఎందుకు వస్తుంది?

నిద్రలేమి అనేది ప్రపంచవ్యాప్తంగా వేలాది మందిని వేధిస్తున్న సమస్య.దీన్ని ఆంగ్లంలో లేదా సైంటిఫిక్ భాషలో Insomnia అని అంటారు.

ఇది మీరు అనుకునేంత చిన్న సమస్య కాదు.రాత్రుళ్లు నిద్ర సరిగ్గా పట్టకపోవడం అనేది చాలా పెద్ద శాపం.

ఎన్నో రకాలుగా అనారోగ్యానికి దారితీస్తుంది నిద్రలేమి.ఈ సమస్య ఎలా మొదలవుతుంది అంటే సరిగ్గా ఇలానే మొదలవుతుంది అని చెప్పడం కష్టం.

దీని వెనుక ఒక కారణం ఉండొచ్చు పలు రకాల కారణాలు ఉండొచ్చు.సాధారణంగానైతే స్ట్రెస్ వలన నిద్రలేమి మొదలవుతుంది.

Advertisement
How Does A Sleeping Pill Works Details, Sleeping Pills, Sleeping Tablets, Mild S

అంటే అది పనికి సంబంధించిన ఒత్తిడి కావచ్చు, వ్యక్తిగత సమస్యలు అంటే లవ్ ఫేల్యూర్, కుటుంబ కలహాలు లేదంటే ఆర్థిక సమస్యలు రావచ్చు.ఈ సమస్య కోసం చాలామంది తీసుకుని చికిత్స నిద్ర మాత్ర.

ఈ మాత్రలు ఎందుకు వేసుకోకూడదు అని చెప్పడానికి వెయ్యి కారణాలు చెప్పవచ్చు.అదంతా, పక్కనపెడితే అసలు నిద్ర మాత్ర ఎలా పనిచేస్తోంది నిద్ర ఎందుకు వస్తుంది? ఈ మాత్ర మన శరీరంలో చేసే పని ఏమిటి? సాధారణంగా రెండు రకాల నిద్రమాత్రలు ఉంటాయి.ఒకటి mild స్లీపింగ్ పిల్స్.

ఈ నిద్ర మాత్ర మనిషి మెదడుపై పనిచేస్తుంది.drowsiness అంటే, నిద్రమత్తు ని కలిగిస్తుంది.

వీటిలో diphenhydramine ఉంటుంది.ఇవి న్యూరన్స్ లోంచి సంచరించే histamine ని బ్లాక్ చేస్తాయి.

చెవిటి వారు కాకూడ‌దంటే ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి!

దాంతో నిద్రమత్తు కలుగుతుంది.కాని ఇది ప్రమాదకరమైన రేంజ్ లో ఉండదు.

Advertisement

డోసేజ్ తక్కువ.సైడ్ ఎఫెక్ట్స్ తక్కువే అయినా, వీటిని అలవాటుగా చేసుకోకూడదు.

మరీ అత్యవసర సమయంలో డాక్టర్ ని అడిగి వేసుకోవచ్చు.రెండొవరకంవి GABA స్లీపింగ్ పిల్స్.

ఇవి డాక్టర్ చెబితేనే వేసుకోవాలి.ఇవి డైరెక్ట్ నరాల వ్యవస్థ పై పనిచేస్తాయి.

ఇవి GABA receptors ద్వారా తమ పని కానిస్తాయి.నరాలని రిలాక్స్ చేసి నిద్ర ముంచుకు వచ్చేలా చేస్తాయి.

వీటి డోసేజ్ ఏమాత్రం పెరిగినా, మనిషి ఊహించని స్థితికి పడిపోవచ్చు.చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది.

నిద్ర హార్మోన్ అయిన Melatonin లెవల్స్ ని ట్రాక్ లో పెట్ట గలిగే మూడొవరకం నిద్రమాత్రలు కూడా వస్తున్నాయి.వీటిలో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తయారుచేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు పరిశోధకులు.

నోట్ :

నిద్రమాత్రలు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేనిదే బయట అమ్మరు.నిద్రలేమిని సహజంగా ట్రీట్ చేసుకుంటేనే మంచిది.

అంటే పొటాషియం ఉండే పధార్థాలు నిద్రకుముందు తినాలి.హస్తప్రయోగం లేదా శృంగారం చేసి నిద్రకు ఉపక్రమించాలి.

బెడ్ రూమ్ లో కంప్యుటర్, టీవి, సెల్ ఫోన్ లేకుండా చూసుకోవాలి.

తాజా వార్తలు