జనవరి ఒకటవ తేదీన కాణిపాకం లోని.. శ్రీ వరసిద్ధి వినాయకుని దర్శనం భక్తులకు ఎలా జరిగిందంటే..

2023 నూతన సంవత్సరం సందర్భంగా మన దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలలో భక్తులు భారీ ఎత్తున తరలివచ్చి పూజలు అభిషేకాలు చేస్తున్నారు.దేశంలో ఏ దేవాలయంలో చూసినా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.

2023 నూతన సంవత్సరం మొదలైన సందర్భంగా జనవరి 1, 2 తేదీల్లో కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ దర్శనానికి భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు.ఆలయ అధికారులు భక్తుల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లను చేశారు.

స్వామివారి సమావేశపు మందిరంలో చైర్మన్ మోహన్ రెడ్డి, ఈవో వెంకటేశ్ అధ్యక్షతన ఆర్డీవో రేణుక వివిధ శాఖల అధికారులు సమావేశమై ఈ ఏర్పాట్లను ఎంతో జాగ్రత్తగా పరిశీలించారు.జనవరి ఒకటి నూతన సంవత్సర సందర్భంగా, అలాగే జనవరి రెండవ తేదీన వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారి దర్శనం కోసం భక్తులు లక్షల మందికి పైగా వచ్చారు.

వీఐపీలు, సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారి దర్శనం కల్పించేందుకు ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు.ఈ సందర్భంగా ఆ వివరాలను ఎమ్మెల్యే బాబు మీడియాకు తెలిపారు.జనవరి ఒకటో తేదీన తెల్లవారు జామున రెండు గంటల నుంచి స్వామివారి దర్శనం కల్పించామని తెలిపారు.12 గంటల తర్వాత స్వామివారికి అభిషేకాలు, అలంకరణ, చందనాలంకరణ ప్రత్యేక పూజల అనంతరం మధ్యాహ్నం రెండు గంటల నుంచి సర్వ దర్శనం చేశమని వెల్లడించారు.

Advertisement

జనవరి ఒకటి, రెండు తేదీలలో స్వామివారి అంతరాలయ దర్శనం అర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు చేశామని తెలిపారు.తిరుపతి, చిత్తూరు, పీలేరు, మదనపల్లి, పలమనేరు, కుప్పం డిపోల నుంచి ఆర్టీసీ సర్వీసులు ఏర్పాటు భక్తులకు ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉన్నాయని తెలిపారు.ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నిత్యం అన్నదాన కార్యక్రమం జరిగిందని ఈ సందర్భంగా వెల్లడించారు.

ఈ అనారోగ్య సమస్యలు ఉన్నవారు పసుపును అస్సలు తినకూడదు.. తింటే మాత్రం..!
Advertisement

తాజా వార్తలు