శ్రీకృష్ణుడికి కూడా తప్పని కష్టాలు ఎలాగంటే..?

శ్రీకృష్ణ పరమాత్ముడి కుమారుడి పేరు సాంబుడు అని చాలామందికి తెలియదు.

ఆ పరమాత్మ కుమారుడు అయిన కూడా అతను నేటి కలియుగ కొడుకుల లాంటి వాడే అని పురాణాలు చెబుతున్నాయి.

పెద్దల పట్ల ఏమాత్రం వినయ విధేయతలు చూపించేవాడు కాదు.సాంబడు శ్రీకృష్ణుడి ఎనిమిది మంది భార్యలలో ఎవరికి పుట్టాడు? అతని జన్మ రహస్యం ఏమిటి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.శ్రీకృష్ణ పరమాత్ముడికి అష్టభార్యాలలో ఒకరైన జాంబవతీదేవికి చాలా సంవత్సరాలు సంతానం కలగలేదు.

పరమశివుడి భక్తురాలు అయిన జాంబవతీదేవి( Goddess Jambavati ) కొడుకును ప్రసాదించమని శివున్ని ప్రార్థిస్తుంది.

How Can Even Lord Krishnas Hardships Be Wrong, Lord Krishna, Sambu, Puranas,

శ్రీకృష్ణుడు కూడా శివుడిని( Lord Shiva ) అడుగుతాడు.అప్పుడు శివుడు నేను లయాకర్తను, ఆ వచ్చే పుత్రునికి కూడా లయ లక్షణాలు ఉంటాయి అని చెబుతాడు.సాంబుడు పుట్టుక తన యాదవ వంశ నాశనం కోసమని ముందుగానే నిర్ణయించినదే కాబట్టి శ్రీకృష్ణుడు సరే అంటాడు.

Advertisement
How Can Even Lord Krishna's Hardships Be Wrong, Lord Krishna, Sambu, Puranas,

దాంతో పరమశివుడు జాంబవతీదేవికి పుత్రుడిని ప్రసాదిస్తాడు.ఆ బాలుడికి సాంబుడు అని నామకరణం చేస్తారు.

అలా జన్మించిన సాంబుడికి క్రమశిక్షణారాహత్యం అత్యధికం.దుర్యోధనునీ బిడ్డ లక్ష్మణను స్వయంవరంలో ఎత్తుకొస్తాడు.

అలా ఎత్తుకెళ్లిన అమ్మాయిని వేరెవరు వివాహం ఆడరు.

How Can Even Lord Krishnas Hardships Be Wrong, Lord Krishna, Sambu, Puranas,

అందుకే దుర్యోధనుడు బంధించి జైల్లో వేస్తాడు.బలరాముడుతో సంప్రదించి రాజీపడి లక్ష్మణ కు సాంబుడికి వివాహం చేస్తాడు.ఇలా శ్రీకృష్ణుడు కొడుకుతో ఎన్నో బాధలు పడతాడు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్ 29, మంగళవారం 2025

సాంబుడు తండ్రిని, పెద్దలను, మునులను అవమానిస్తాడు.ఒకసారి ఈ సాంబుడు స్త్రీ గర్భవతి వేషంలో ఉండగా అటుగా వచ్చిన దుర్వాసుని తో నాకు ఎవరు పుడతారో చెప్పమని హేళన చేస్తాడు.

Advertisement

దుర్వాసుడు ముసలం పుడుతుంది పో అని శపిస్తాడు.ఆ ముసలాన్ని అరగదీసి సముద్రంలో కలుపుతారు.

అదంతా ఒడ్డుకు కొట్టుకొచ్చి తుంగలాగా పెరుగుతుంది.ఆ గడ్డితో విదిలిస్తేనే ఎదుటి వారు మరణిస్తారు.

ఆ ముసలమే యాదవ జాతిని అంతం చేస్తుందని కృష్ణుడికి తెలుసు.కురుక్షేత్ర యుద్ధం( Kurukshetra War ) తర్వాత మహా ప్రతివ్రత గాంధారిదేవి కూడా నా సంతానం లాగే నీ యాదవ వంశం కూడా అంతరిస్తుందని ఇచ్చిన శాపాన్ని కూడా శ్రీకృష్ణుడు స్వీకరిస్తాడు.

శ్రీకృష్ణుడు కూడా సాధారణ తండ్రి వలె కొడుకు వల్ల ఆ కష్టాలు అనుభవించాడు.అందరికీ దిక్కైన కూడా అనాధ లాగా ద్వారక అడవిలో మరణిస్తాడు.

అర్జునుడు ( Arjuna )వేతుకుతుండగా బోయవాడు చూపిస్తే శ్రీకృష్ణుడు ఆచూకీ తెలుసుకున్న అర్జునుడు ఎంతో విలపిస్తాడు.అర్జునుడు శ్రీకృష్ణుడి అంతక్రియలు ముగిస్తాడు.

తాజా వార్తలు