హీరోల కొడుకుల్ని బాబు అని పిలవడం వెనక అసలు కథ ఇంత ఉందా ?

హీరోకి కొడుకు ఉంటె అతడిని ఖచ్చితంగా బాబు అని పిలుస్తూ భజన చేస్తూ ఉంటారు మన టాలీవుడ్ లో.అసలు ఈ బాబు అనే పదం ఎలా వచ్చింది ? దీని వెనక కహాని ఏంటో తెలుసుకుందాం.

గతంలోకి వెళ్తే 1940 ప్రాంతం లో అక్కినేని నాగేశ్వర రావు ఇంటర్వ్యూ ఇచ్చారు.

సినిమాల్లో నటించే వారిని ఆర్టిస్టులు అని పిలిచేవారని ఒక ఉదాహరణ గా చెప్పారు.ఆ టైం లో తాను చిన్న హీరో కాబట్టి అప్పటి సీనియర్ దర్శకుడు ఒకరు భూతు మాటలు మాట్లాడం బాగా అలవాటు గా మారిపోవడం తో అక్కినేని కూడా ఒక భూతు పదం పెట్టి పిలుస్తూ ఉండేవారట.

తన కన్నా చాలా సీనియర్ కాబట్టి ఏమి అనలేకపోయారట అక్కినేని.

ఏమైనా అంటే ఉన్న ఆ కాస్త వేషం కూడా ఇవ్వరు అని అయన బాధ.నెల జీతం మీద పని చేసే అక్కినేని బాలరాజు సినిమా తో మంచి బ్రేక్ వచ్చింది.ఆ తర్వాత కూడా మళ్లీ ఇంకో సినిమా చేయాలంటే నా దగ్గరకు రా అబ్బాయి అని సదరు దర్శకుడు పిలిచాడట.

Advertisement

కానీ ఆ ఒక్క భూతు పదం తో పిలవడం ఆపేస్తే తప్ప రాను అన్నాడట.దాంతో భలేవాడివి రా వచ్చేయి .ఇంకా అలా పిలవను అని చెప్పారట.అదే సమయంలో భానుమతి గారికి కూడా అలాంటి సంఘటనలు అనేకం జరిగాయి.

ఆ తరం వారు మర్యాద కోసం ఎన్నో పాట్లు పడ్డారు పైగా ఆర్టిస్టులు అంటే ఒక చులకన భావం ఉండేది ఆ సమయంలో.

హెచ్.యం.రెడ్డి, కే.వీ.రెడ్డి, ఆదుర్తి సుబ్బా రావు తర్వాత ఎన్టీఆర్ మరియు అక్కినేని వంటి నటులు సీనియర్స్ గా చలామణి చేసారు.అప్పుడే కొత్తగా వచ్చే నటులకు సీనియర్స్ అయినా హీరోలకు గౌరవం ఇవ్వాల్సి వచ్చింది.

దాంతో సార్, బాబు, అయ్యా అనే పదాలు పుట్టుకచ్చాయి.ఎన్టీఆర్ కొడుకు అయినా హరికృష్ణ ను ముద్దుగా బాబు అని బాలకృష్ణ ను బాలయ్య అని సంబోధించడం మొదలు పెట్టారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్12, గురువారం2024
వైరల్ వీడియో : పాఠాలు వింటూనే గుండెపోటుకు గురైన చిన్నారి.. చివరకి?

అక్కినేని కొడుకులైన వెంకట్ ని పేద బాబు గా నాగార్జున ను చిన్నబాబు గా పిలిచేవారు.అలా హీరోల పిల్లలను ఫార్మాలిటీ గా బాబు అని పిలవడం మొదలయ్యింది.

Advertisement

అదే బాబు అనే పేరు కృష్ణ కొడుకులకు రమేష్ బాబు గా, మహేష్ బాబు గా తగిలించారు.మహేష్ బాబు వరకు వచ్చే సరికి బాబు అనే పదం పిచ్చిగా మారిపోయింది.

హీరోల కొడుకులు కాబట్టి బాబు అన్నారు హీరోల కూతుర్లు అయితే పాపా అంటారా ?.

తాజా వార్తలు