వైరల్: పెద్ద సమస్యను పరిష్కరించిన గేద.. ఎలా అంటే..

సాధారణంగా మనం రెండు వర్గాల మధ్య గొడవల పరిష్కారానికి ఊర్లలో పంచాయతీలు పెట్టి తీర్పును ఇవ్వడం చూస్తూనే ఉంటాం.ఇది ఇలా ఉండగా.

తాజాగా ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య మొదలైన పంచాయితీ చివరకు ఒక గేద( Buffalo ) పరిష్కారం చూపించింది అంటే నమ్మండి.అవును మీరు విన్నది నిజమే.

ఇద్దరి వ్యక్తుల మధ్య గొడవను( Dispute ) ఒక గేద పరిష్కరించి అందరూ ఆశ్చర్యానికి గురి చేసింది.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

ఉత్తరప్రదేశ్ లోని( Uttar Pradesh ) ప్రతాప్‌ గఢ్‌ జిల్లా అక్షరాంపూర్‌ గ్రామంలో నందలాల్ సరోజ్ కు( Nandalal Saroj ) చెందిన ఒక గేద గత కొన్ని రోజుల నుంచి కనిపించడం లేదు.ఆ తర్వాత ఆ గేద పక్కనే ఉన్న పూరే హరికేశ్‌ గ్రామానికి చేరింది.ఆ ఊరికి చెందిన హనుమాన్‌ ( Hanuman ) దాన్ని కట్టేశాడు.

Advertisement

ఇక నందలాల్ ఆ గేదను ఎంత వెతికినా కూడా ఆచూకీ కనిపించలేదు.కానీ.

, చివరకు హనుమాన్ వద్ద ఉందని నిజం తెలుసుకున్న అతడు అక్కడికి వెళ్లి హనుమాన్ ను అడగగా అతను తన గేదనేనని వాదించడం మొదలుపెట్టాడు.దీంతో నందలాల్ కు ఏం చేయాలో అర్థం కాక.నందలాల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసి మరి పంచాయతీకి పిలిపించాడు.

ఇక ఈ పంచాయతీలో ఆ గేదె నాదంటే నాదని ఇద్దరూ కూడా గొడవపడ్డారు.ఇక ఈ తరుణంలో స్టేషన్ ఆఫీసర్ ఏం చేయాలో అర్థం కాక ఒక నిర్ణయానికి వచ్చాడు.అది ఏమిటంటే.

, ఆ గేదెను రెండు ఊర్ల మధ్య విడిచిపెడితే ఆ గేదె ఎవరి ఇంటి వద్దకు వెళ్తే వారే అసలైన యజమాని అని స్పష్టంగా తెలియచేశారు.దీనితో ఇరువు వర్గాలు సమ్మతమే అని చెప్పగా.

ఎన్ కన్వెన్షన్ కూల్చివేత కరెక్టేనా... రేవంత్ రెడ్డికి మద్దతుగా నిలిచిన నాగబాబు!
అప్పుడేమో అలా.. ఇప్పుడేమో ఇలా.. విష్ణుప్రియ వీడియో వైరల్..

దీంతో ఆ గేదెను తీసుకొచ్చి రెండు ఊర్ల మధ్య విడిచిపెట్టారు.ఆ తర్వాత ఆ గేద నేరుగా నందలాల్ ఇంటికి వెళ్లిపోయింది.

Advertisement

దీంతో హనుమాన్ ను పోలీసులు, గ్రామస్తులు మందలించి ఆ గేదె తన యజమానిని ఎంచుకున్నది అంటూ తెలిపారు.

తాజా వార్తలు