గతేడాది జూన్ 18న ఖలిస్తాన్ వేర్పాటువాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ప్రమేయం వుందంటూ ప్రైవేట్ మెంబర్ మోషన్‌ను కెనడా హౌస్ ఆఫ్ కామన్స్( Canada House Of Commons ) ఆమోదించింది.
“Political Interference, Violence or Intimidation on Canadian Soil” అనే మోషన్‌ను ఫిబ్రవరి 12న ఇండో కెనడియన్ ఎంపీ సుఖ్ ధాలివాల్( Indo-Canadian MP Sukh Dhaliwal ) ప్రవేశపెట్టారు.
దీనిని 8 మంది ఇండో కెనడియన్లు సహా పలువురు ఎంపీలు సమర్ధించారు.దీనికి అనుకూలంగా 326 ఓట్లు పోలవ్వగా.
ఏ ఒక్కరూ వ్యతిరేకించకపోవడం గమనార్హం.కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో,( PM Justin Trudeau ) పలువురు కేబినెట్ మంత్రులు, ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ నేత పియరీ పొయిలీవ్రేలు( Pierre Poilievre ) కూడా అనుకూలంగా ఓటు వేశారు.
‘‘ కెనడియన్ గడ్డపై ఒక ప్రార్థనా స్థలంలో కెనడియన్ పౌరుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య, దీని వెనుక భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం వుందన్న ఆరోపణలు సహా ఇటీవలి సంఘటనలను గుర్తించాలని సభ కోరుతోంది.భారత్, చైనా, రష్యా, ఇరాన్, ఇతర దేశాల నుంచి పెరుగుతున్న బెదిరింపులు ఈ విదేశీ జోక్యానికి ఉదాహరణలు ’’.అని తీర్మానంలో పేర్కొన్నారు.మరోవైపు.
ఈ తీర్మానంపై ధాలివాల్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.మా ప్రజాస్వామ్య సంస్థలను అణగదొక్కడం, హింసాత్మక చర్యలలో పాల్గొనడం లేదా కెనడాలోని డయాస్పోరా కమ్యూనిటీలను భయపెట్టడం వంటి వెనుక విదేశీ జోక్యం( Foreign Interference ) లేదా వ్యక్తి లేదా ఏజెంట్లనైనా ఈ తీర్మానం పరిగణనలోనికి తీసుకుంటుంది అని ధాలివాల్ పేర్కొన్నారు.
ఈ ప్రతిపాదనను ప్రముఖ ఇండో - కెనడియన్ సంస్థ, కెనడా ఇండియా ఫాండేషన్ (సీఐఎఫ్) వ్యతిరేకించింది.గత నెలలో ధాలివాల్‌కు రాసిన లేఖలో .ఈ మోషన్ ఆమోదించబడితే కెనడా - భారత్ మధ్య సంబంధాలు మరింత దెబ్బతింటాయని హెచ్చరించింది.ద్వైపాక్షిక సమస్యలు పరిష్కరించబడాలని ఆసక్తితో వున్న సంస్థగా, హింసాత్మక మైనారిటీ అసమాన ప్రభావం దేశ రాజకీయాలు, విదేశాంగ విధానంపైనా చూపుతుందని సీఐఎఫ్ ఆందోళన వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy