కరోనా కు తొలి హోమియో వ్యాక్సిన్..!

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుంది.

అయితే ఓ పక్క వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేసినా ఇంకా చాలా చోట్ల వ్యాక్సిన్లు అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

అయితే ప్రపంచంలో తొలిసారిగా కరోనా కు హోమియోపతి టీకా అందుబాటులోకి తెస్తున్నారు.హోమియోపతీలో టీకాలు ఉంటాయా ? అని డౌట్స్ ఏమి అక్కర్లేదని చెబుతున్నారు నిపుణులు.ముంబైలోని లైఫ్ ఫోర్స్ హోమియోపతి అండ్ బయోసిమిలా చీఫ్, పరిశోధకుడు అయిన డాక్టర్ రాజేశ్ షా హోమియోపతి టీకా నొసోడ్‌ను సిద్ధం చేశారు.

Homeopathy Corona Vaccine First Time In The World, Corona Vaccine , Covid Vaccin

ఇది దాదాపు 62 శాతం రోగనిరోధకశక్తిని పెంచుతుందట మనసుకి కూడా హాయిగా అనిపించడానికి ఇది ఉపయోగపడుతుందని ప్రూవ్ చేశారు.కరోనా పై పోరాడేందుకు మానసిక దృడత్వంతో రోగనిరోధక శక్తి చాలా అవసరం ఇవి రెండు హోమియోపతి వ్యాక్సిన్ ఇస్తుందని చెబుతున్నారు.

వ్యాధి నుండి రక్షణ కల్పించడానికి రోగ నియంత్రణకు నొసడ్ ను టీకాగా గుర్తించాలని అంటున్నారు డాక్టర్లు.క్లినికల్ ట్రయల్స్ నిర్వహిచిన కోవిడ్ ను సమర్ధవంతంగా ఈ టీకా ఎదుర్కొంటున్నట్టు తేలింది.

Advertisement

డాక్టర్ రాజేష్ షా రెండు దశాబ్ధాలుగా హోమియో ఔషధాలను తయారు చేస్తున్నారు.వీటితో పాటుగా రెండు టీకాలను ఆయన అందించారు.

 త్వరలోనే హోమియో వ్యాక్సిన్ కూడా ప్రజలకు అందుబాటులోకి తెస్తారని తెలుస్తుంది.దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు