తెల్ల జుట్టుకు చెక్ పెట్టే హోమ్ మేడ్ సీరమ్ ఇది.. క‌చ్చితంగా ట్రై చేయండి!

తెల్ల జుట్టు.( white hair ) మనలో చాలా మందిని కలవర పెట్టే సమస్యల్లో ఇది ఒకటి.

అయితే ఎక్కువ శాతం మంది తెల్ల జుట్టును ఇష్టపడరు.ఎందుకంటే తెల్ల జుట్టు ముసలితనానికి సంకేతం.

అందుకే తెల్ల జుట్టు కనపడగానే తెగ హైరానా పడిపోతుంటారు.కానీ టెన్షన్ వద్దు.

ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ హెయిర్ సీరంను కనుక వాడితే వైట్ హెయిర్ కు ఈజీగా చెక్ పెట్టవచ్చు.కురులను నల్లగా మెరిపించుకోవచ్చు.

Advertisement

మరి ఇంతకీ ఆ హెయిర్ సీరంను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ కాస్త అనగానే అందులో వన్ టేబుల్ స్పూన్ ఆమ్లా పౌడర్, రెండు టేబుల్ స్పూన్లు కాఫీ పౌడర్,( Coffee powder ) వన్ టేబుల్ స్పూన్ కలోంజి సీడ్స్ పౌడర్ వేసి మరిగించాలి.దాదాపు ఇరవై నిమిషాల పాటు మరిగించిన త‌ర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వాటర్ ను చల్లారబెట్టుకోవాలి.

ఆపై స్ట్రైనర్ సహాయంతో వాట‌ర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ వాటర్ లో రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్, వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె, వన్ టేబుల్ స్పూన్ ఆవనూనె( Mustard oil ) వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

తద్వారా మన హెయిర్ సీరం సిద్ధమవుతుంది.ఈ సీరం ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి బాగా అప్లై చేసుకుని.

అదుర్స్ 2 ఆ కారణం చేతే చెయ్యలేదు...ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్! 
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్5, శనివారం 2025

కచ్చితంగా ప‌ది నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.

Advertisement

రెండు గంటల అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.తెల్ల జుట్టు రావడం స్టార్ట్ అయితే వెంటనే ఈ సీరంను వారానికి రెండు సార్లు వాడండి.ఈ సీరం జుట్టులో మెలనిన్ ఉత్పత్తిని పెంచుతుంది.

తెల్ల జుట్టుకు అడ్డుకట్ట వేస్తుంది.కురులు నల్లగా మెరిసేలా చేస్తుంది.

అలాగే ఈ సీరంను వాడటం వల్ల హెయిర్ రాలడం తగ్గి ఒత్తుగా సైతం పెరుగుతుంది.

తాజా వార్తలు