కంటి అల‌స‌ట‌కు చెక్ పెట్టే ఆలుగడ్డ..ఎలాగంటే?

కంటి అల‌స‌ట‌ స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా చాలా మంది కామ‌న్‌గా ఎదుర్కొనే స‌మ‌స్య‌ల్లో ఇది ఒక‌టి.

ముఖ్యంగా గంట‌లు త‌ర‌బ‌డి ల్యాప్‌టాపుల ముందు ప‌ని చేసే వారు త‌ర‌చూ ఈ స‌మ‌స్య‌తో ఇబ్బంది ప‌డుతూ ఉంటారు.

క‌ళ్ళు తీవ్రంగా స్ట్రెయిన్ అయిన‌ప్పుడు.ఏ ప‌ని పైనా దృష్టి సారించ‌లేక‌పోతుంటారు.

క‌ళ్ళు మూత‌లు ప‌డిపోతుంటాయి.త‌ల తిరుగుతున్న‌ట్టు ఉంటుంది.

అలాంట‌ప్పుడు కొన్ని కొన్ని సింపుల్ టిప్స్‌ను పాటిస్తే.సుల‌భంగా కంటి ఆల‌స‌ట‌ను నివారించుకోవ‌చ్చు.

Advertisement

మ‌రి ఆ టిప్స్ ఏంటో లేట్ చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.అల‌సిన క‌ళ్ళ‌కు ఉప‌శ‌మ‌నాన్ని అందించ‌డంలో ఆలుగ‌డ్డ గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.

పీల్ తీసిన ఆలుగడ్డ తీసుకుని మెత్త‌గా నూరి ర‌సం తీసుకోవాలి.ఇప్పుడు ఈ ర‌సాన్ని కొంత స‌మ‌యం పాటు ఫ్రిజ్ పెట్టి.

ఆ త‌ర్వాత దూది సాయంతో కంటిపై అప్లై చేసుకుని కాసేపు విశ్రాంతి తీసుకోవాలి.ఇలా చేస్తే కంటి అల‌స‌ట త్వ‌ర‌గా దూరం అవుతుంది.

అలాగే ఒక బౌల్‌లో క‌ల‌బంద నుంచి జెల్ తీసుకుని వేసుకోవాలి.ఇప్పుడు ఇందులో తేనె వేసి బాగా క‌లుపుకునికంటిపై అప్లై చేసుకోవాలి.

ఎస్‌యూవీ కారుపైకి దూకిన కోతి.. అది చేసిన తుంటరి పనికి యజమాని షాక్!
పుష్ప 2 అనుకున్న రేంజ్ లో ఆడకపోతే ఎవరికి ఎక్కువ నష్టం వస్తుంది...

ఇర‌వై నిమిషాల త‌ర్వాత కూల్ వాట‌ర్‌తో క‌ళ్ళ‌ను శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా చేసినా మంచి ఫ‌లితం ఉంటుంది.

Advertisement

కంటి అల‌స‌ట‌ను త‌గ్గించ‌డంలో బేబీ ఆయిల్ కూడా సూప‌ర్‌గా హెల్ప్ చేస్తుంది.బేబీ ఆయిల్‌ను వేళ్ల‌తో క‌ళ్ల‌పై అప్లై చేసుకుని.సవ్యదిశలో మూడుసార్లు, ఆ తర్వాత అపసవ్య దిశలో మరో మూడుసార్లు గుండ్రంగా తిప్పుతూ మర్దన చేసుకోవాలి.

ఆ త‌ర్వాత పావు గంట పాటు విశ్రాంతి తీసుకుంటే.క‌ళ్లు రిలాక్స్ అయిపోతాయి.

ఇక ప‌చ్చి పాల‌ను ఐస్ ట్రేలో వేసి.ఐస్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ ఐస్ ముక్క‌ల‌ను ఒక కాట‌న్ క్లాత్ చుట్టి.కంటిపై అద్దుకోవాలి.

ఇలా చేసినా కూడా కంటి అల‌స‌ట పరార్ అవుతుంది.

తాజా వార్తలు