నోటి చుట్టూ ముడ‌త‌ల‌కు కార‌ణాలు, నివార‌ణ మార్గాలు మీకోసం!

సాధార‌ణంగా కొంద‌రికి నోటి చుట్టూ ముడ‌త‌లు వ‌స్తూ ఉంటాయి.వ‌య‌సు పైబ‌డే కొద్ది ముడ‌త‌లు రావ‌డం కామ‌నే.

కానీ, కొంద‌రికి చిన్న వ‌య‌సులోనే ముడ‌త‌లు ప‌డ‌తాయి.ఎండ‌ల్లో ఎక్కువ‌గా తిర‌గ‌డం, ధూమ‌పానం, ఆహార‌పు అల‌వాట్లు, సన్ స్క్రీన్ క్రీమ్ వాడ‌క పోవ‌డం, కెమిక‌ల్స్ ఎక్కువ‌గా ఉండే మేక‌ప్ ప్రోడెక్ట్స్‌ను యూజ్ చేయ‌డం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల నోటి చుట్టూ ముడ‌త‌లు ఏర్ప‌డుతూ ఉంటాయి.

ఈ ముడ‌త‌ల వ‌ల్ల వ‌య‌సు పైబ‌డిన వారిలా క‌నిపిస్తారు.అందుకే వీటిని నివారించుకునేందుకు నానా ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.

అయితే స‌రైన ప‌ద్ధ‌తులు పాటిస్తే.చాలా సుల‌భంగా నోటి చుట్టూ ఏర్ప‌డిన ముడ‌త‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు.

Advertisement

మ‌రి ఆ ప‌ద్ధ‌తులు ఏంటో చూసేయండి.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక ఎగ్ వైట్‌, ఒక స్పూన్ కొబ్బరి నూనె వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముడ‌త‌లు ప‌డిన చోట అప్లై చేసి.ఇర‌వై నిమిషాల అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో క్లీన్ చేసుకుని మాయిశ్చ‌రైజ‌ర్ అప్లై చేసుకోవాలి.

ఇలా రెగ్యుల‌ర్‌గా చేస్తే మంచి ఫ‌లితం ఉంటుంది.అలాగే ఒక గిన్నె తీసుకుని అందులో ప‌చ్చి బొప్పాయి పేస్ట్‌, చంద‌నం పొడి మ‌రియు తేనె వేసుకుని బాగా క‌లుపుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని చ‌ర్మానికి అప్లై చేసి.పావు గంట పాటు డ్రై అవ్వనివ్వాలి.

అల్లంతో అధిక హెయిర్ ఫాల్ పరార్.. ఎలా వాడాలంటే?
అక్కడ నాని మూవీ కేవలం 5 థియేటర్లలో రిలీజవుతోందా.. అసలేం జరిగిందంటే?

అనంత‌రం చ‌ల్ల‌టి నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.ఇలా చేసినా కూడా నోటి చుట్టు ఏర్ప‌డిన ముడ‌త‌లు త‌గ్గుతాయి.

Advertisement

ఇక ఈ టిప్స్‌తో పాటు నీటిని ఎక్కువ‌గా తీసుకోవాలి.ఒత్తిడికి దూరంగా ఉండాలి.డైట్‌లో తాజా పండ్లు, ఆకు కూర‌లు, న‌ట్స్‌, మొల‌కెత్తిన విత్త‌నాలు, పాలు, పెరుగు వంటివి ఖ‌చ్చితంగా ఉండేలా చూసుకోవాలి.

రోజుకు క‌నీసం ఏడు గంట‌లు నిద్రించాలి.శ‌రీరానికి ఎక్కువ‌గా ఎండ త‌గ‌ల‌కుండా ర‌క్షించుకోవాలి.

త‌ద్వారా ముడ‌త‌లు ప‌రార్ అవుతాయి.మీరు య‌వ్వ‌నంగా క‌నిపిస్తారు.

తాజా వార్తలు