కళ్ళజోడు మచ్చలతో ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఇలా ట్రై చేయండి...!

ప్రస్తుత టెక్నాలజీ కాలంలో చాలామంది ఇబ్బంది పడుతున్న సమస్యల్లో ఒకటి కంటి చూపు.అవును.

ఎక్కువసేపు సెల్ ఫోన్, టీవీ, ల్యాప్ టాప్, కంప్యూటర్ లాంటి వాటిని అదే పనిగా చూస్తుండటంతో చాలామందికి చిన్నవయసులోనే కళ్ళజోళ్ళు వస్తున్నాయి.ఇలా కళ్ళజోళ్ళు ప్రతిరోజు పెట్టుకోవడం ద్వారా ముక్కు పై మార్క్స్ ఏర్పడుతున్నాయి.

Home Remedies To Remove Spectacle Marks On Nose, Spectacle Marks , Home Remedie

మరికొందరు ఎలాంటి కంటిచూపు కారణాలు లేకపోయినా.స్టైల్ కోసం పెట్టుకోవడం ద్వారా ఈ మార్క్స్ ఏర్పడుతున్నాయి.

ఇలా వీటిని రోజూ పెట్టుకోవడం ద్వారా చర్మం మీద పిగ్మెంటేషన్ మార్క్స్ బాగా ఏర్పడతాయి.అయితే వీటి నుంచి తప్పించుకోవడానికి కొన్ని నివారణలను చూద్దామా.

Advertisement

ముందుగా కళ్ళజోళ్ళ నుండి దూరం కావడానికి చాలామంది కాంటాక్ట్ లెన్స్ వాడటానికి ఇష్టపడతారు.ఇక సహజ పద్ధతిలో ఈ మార్క్స్ ను దూరం చేసుకోవాలంటే బంగాళదుంపలో ఉండే బ్లీచింగ్ కాంపౌండ్స్ ద్వారా నల్లటి మచ్చలను తొలగించడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

బంగాళదుంపను కట్ చేసుకుని ఆ ముక్కను తీసుకొని ఎక్కడైతే మార్క్స్ ఏర్పడ్డాయో వాటి పై కాస్త రుద్దడం ద్వారా మంచి పరిష్కారం లభిస్తుంది.ఇలా చేయడం ద్వారా మార్క్స్ తగ్గడానికి ఉపయోగపడతాయి.

ఇక మరో మార్గం నిమ్మకాయలలో కూడా సహజమైన బ్లీచింగ్ లక్షణాలు ఉంటాయి.ఇది కూడా కళ్ళజోడు వల్ల ఏర్పడిన నల్లటి మచ్చలను తొలగించడానికి సమర్థవంతంగా పనిచేస్తాయి.

ఒక గిన్నెలో రెండు స్పూన్ల నిమ్మరసం అలాగే ఒక స్పూన్ నీటిని కలిపి ఆ మిశ్రమాన్ని ఒక కాటన్ బాల్ ను ఉపయోగించి మార్క్స్ ఉన్న ప్రాంతంలో రాస్తే అవి తగ్గడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.ఇలా చేయడం ద్వారా ఎక్కడైతే మచ్చలు కలిగి ఉన్నాయో అక్కడ చర్మానికి సంబంధించిన పిగ్మెంటేషన్ సమస్యలను, అలాగే ఏవైనా మార్క్స్ ఉంటే తగ్గడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 'కిష్కింధపురి ' టీజర్ ఎలా ఉందంటే..?

అలాగే ఆడవారు నిమ్మరసంలో తేనెను కలుపుకొని కూడా ఇలా ప్రయత్నించవచ్చు.

Advertisement

తాజా వార్తలు