వెరికోస్ వెయిన్స్ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ చిట్కాను పాటించండి..

ప్రస్తుత కాలంలో చాలామంది వెరికోస్ వెయిన్స్ సమస్యతో బాధపడుతున్నారు.అయితే ఈ సమస్య తలెత్తడానికి కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మన గుండె నుంచి మన రక్తాన్ని ఇతర శరీర భాగాలకు కణజాలాలకు రక్తాన్ని సరఫరా చేసే వాటిని ధమనులు అంటారు.అదేవిధంగా కణజాలాల నుండి ఇతర శరీర భాగాలకు చెడు రక్తాన్ని గుండెకు చేర్చే వాటిని సిరలు అంటారు.

అయితే ఈ సిరలు అక్కడక్కడ కవాటాలు ఉంటాయి.అయితే ఇవి గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా పనిచేస్తాయి.

ఈ కవాటాలు సిరల్లో రక్తాన్ని కింది నుంచి గుండెపై వరకు చేరుస్తాయి.అయితే ఈ కవాటాలు బలహీనపడడంతో లేదా అడ్డంకులు ఏర్పడడంతో రక్తం పైకి చేరుకోకుండ కిందికి వెళ్ళిపోతుంది.

Advertisement

అయితే ఒక్కొక్కసారి రక్తం అక్కడే గడ్డకట్టుకుపోతుంది.దీంతో మన సిరలు బలహీనపడి ఉబ్బిపోతాయి.

ఎక్కువగా ఈ సమస్య గర్భిణీ స్త్రీలలో కనిపిస్తుంది.అలాగే ఎక్కువగా నిలబడి పనిచేసే వారిలో, అధిక బరువుతో బాధపడేవారిలో, మూత్రపిండాల సమస్యతో బాధపడే వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.

ఇక మెనోపాజ్ దశ దాటిన మహిళల్లో కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.అదేవిధంగా వంశపారపర్యంగా కూడా వెరికోస్ వెయిన్స్ సమస్య వస్తుంది.

అయితే ఈ సమస్యను మొదట్లోనే గుర్తించి చికిత్స తీసుకోవడం చాలా అవసరం.ఈ సమస్యను కొన్ని సహజసిద్ధ ఇంటి చిట్కాలతో కూడా నయం చేసుకోవచ్చు.అయితే ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Dandruff Homemade Serum : ఈ హోమ్‌ మేడ్ సీర‌మ్ ను వాడితే డాండ్రఫ్ అన్న మాటే అన‌రు!

ముందుగా ఒక గిన్నెలో పది ఎండు ద్రాక్షలు, ఒక స్పూన్ చియా విత్తనాలు, అవిసె గింజలు ఒక టీ స్పూన్ వేసి బాగా వేయించి పొడిగా చేసుకుని ఈ పొడిని నీటిలో పోసి ఒక రాత్రంతా అలాగే ఉంచాలి.దీంతో తయారైన మిశ్రమాన్ని రోజు ఉదయం పరగడుపున తాగాలి.

Advertisement

ఆ తర్వాత ఈ నీటిని తీసుకున్న అరగంట తర్వాత అసలు ఆహారాన్ని తీసుకోకూడదు.ఎండు ద్రాక్షలు, చియా విత్తనాలు నమిలి తినాలి.

ఇలా ఈ పానీయాన్ని తయారు చేసుకొని తరచు తాగుతూ ఉండడంతో శరీరానికి తగినంత శక్తి లభించడంతో పాటు వెరికోస్ వెయిన్స్ సమస్య కూడా తగ్గుతుంది.

తాజా వార్తలు