పిప్పి పన్ను సమస్యతో బాధపడుతున్నారా..? అయితే ఈ సులభమైన చిట్కాను..!

ప్రస్తుత సమాజంలో చాలామంది ప్రజలు పిప్పి పన్ను సమస్య( Tooth Decay )తో బాధపడుతూ ఉన్నారు.

ఈ సమస్య వస్తే మాత్రం నరకాన్ని భూమి పైన చూసినట్లు అనిపిస్తుంది.

ముఖ్యంగా చెప్పాలంటే ఈ సమస్య ఉన్న వారు ఏ పనిని చేయలేరు.ఏమీ తినడానికి వీలు కాదు.

చిన్న వారికైనా, పెద్ద వారికైనా ఈ సమస్య వస్తే చాలా రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.ఈ సమస్య రావడానికి ముఖ్యమైన కారణం నోటిలోని చెడు బ్యాక్టీరియా అని వైద్యనిపుణులు చెబుతున్నారు.

మనం తీసుకునే ఆహారంలోనీ చెడు బ్యాక్టీరియా పెరుగుతూ ఉంటుంది.

Home Remedies For Tooth Decay Problems, Tooth Decay,dental Problems,sensitive Te
Advertisement
Home Remedies For Tooth Decay Problems, Tooth Decay,Dental Problems,Sensitive Te

అంతే కాకుండా వేడి వేడి ఆహారాలను, పానీయాలను తాగిన అలాగే శీతల పానీయాల వల్ల పళ్లు సెన్సిటివ్ గా తయారవుతాయి.కొంతమంది అదే పనిగా కాఫీలు, టీలు కూడా తాగుతూ ఉంటారు.అలాగే మరికొంత మంది జంక్ ఫుడ్స్, చాక్లెట్స్, ఐస్ క్రీమ్ లు కూడా తింటూ ఉంటారు.

దీని వల్ల తినే ఆహారంలో ఫైబర్ ఎక్కువగా లేకపోయినా కూడా దంతాల సమస్యలు( Dental Problems ) పెరిగే అవకాశం ఉంది.ముఖ్యంగా చెప్పాలంటే పిప్పి పన్ను నొప్పి రాగానే చాలా మంది వెంటనే ట్యాబ్లెట్లు తెచ్చుకొని ఉపయోగిస్తూ ఉంటారు.

లేదంటే డాక్టర్ల వద్దకు పరుగులు పెడుతుంటారు.ఇలా చేసే కంటే మొదటగా ఇంట్లోనే చిన్న చిట్కాలు పాటించి చూస్తే సరిపోతుంది.

అప్పుడు కూడా తగ్గకుండా వైద్యులను సంప్రదించడం మంచిది.

Home Remedies For Tooth Decay Problems, Tooth Decay,dental Problems,sensitive Te
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

ముఖ్యంగా చెప్పాలంటే బత్తాయి పండు( Orange ) పిప్పి పన్ను సమస్యను తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.బత్తాయి జ్యూస్ తాగితే ఎలాంటి ప్రయోజనం ఉండదు.కానీ బత్తాయి తినడం ఎంతో మంచిది.

Advertisement

నోట్లో పేరుకుపోయిన చెడు బ్యాక్టీరియాను తొలగించి దంతాలను పుచ్చిపోకుండా చేయడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.ఈ పండు నమిలి తినడం వల్ల దంతాలపై ఉండే గార సులభంగా తొలగిపోతుంది.

అలాగే నోటిలో ఉండే చెడు బ్యాక్టీరియా కూడా నశిస్తుంది.నోరు( Mouth Wash ) శుభ్రంగా ఉంటుంది.

అలాగే బత్తాయిని నమలి తినడం వల్ల నోటి నుంచి వచ్చే దుర్వాసన కూడా తగ్గిపోతుంది.

తాజా వార్తలు