ఇన్‌స్టెంట్‌‌ ఫేస్ గ్లో కోసం ఎఫెక్టివ్ హోమ్ రెమెడీస్!

స‌డెన్‌గా ఏదైనా అకేష‌న్ వ‌చ్చిన‌ప్పుడు.ముఖం డ‌ల్‌గా, అంద‌హీనంగా ఉంటే వ‌చ్చే బాధ అంతా ఇంతా కాదు.

ఆ స‌మ‌యంలో ఫేస్ గ్లోగా తెచ్చుకునేందుకు ప‌డే పాట్లు ఎన్నెన్నో.ఇన్‌స్టెంట్‌ ఫేస్ గ్లో కోసం మార్కెట్‌లో ల‌భ్య‌మ‌య్యే ఫేస్ ప్యాక్స్ వాడుతుంటారు.

అయిన‌ప్ప‌టికీ, ఫ‌లితం లేకుంటే తెగ చింతిస్తుంటారు.అయితే ఇన్‌స్టెంట్‌గా‌ ఫేస్ గ్లో రావాల‌ని అనుకునే వారు న్యాచుర‌ల్‌గా కూడా ప్ర‌య‌త్నించ‌వ‌చ్చు.

ముఖ్యంగా ఇప్పుడు చెప్ప‌బోయే టిప్స్‌ను ఫాలో అయితే సులువుగా ఇన్‌స్టెంట్ ఫేస్ గ్లో పొందొచ్చు.మ‌రి ఆ టిప్స్ ఏంటీ అన్న‌ది లేట్ చేయ‌కుండా ఓ లుక్కేసేయండి.

Advertisement
Home Remedies For Instant Face Glow! Home Remedies, Instant Face Glow, Face Glow

ఒక బౌల్ తీసుకుని అందులో ఎగ్ వైట్‌, నిమ్మ ర‌సం మ‌రియు షుగ‌ర్ వేసి బాగా మిక్స్ చేయాలి.ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసి.

ఇర‌వై లేదా ముప్పై నిమిషాల పాటు ఆరిపోనివ్వాలి.అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

ముఖం ఇన్‌స్టెంట్ గ్లో కావాల‌నుకునే వారికి ఆ ప్యాక్ అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

Home Remedies For Instant Face Glow Home Remedies, Instant Face Glow, Face Glow

అలాగే ఒక బౌల్‌లో ఒక టీ స్పూన్ శెన‌గ‌పిండి, పాలు మ‌రియు రోజ్ వాట‌ర్ వేసి బాగా క‌లుపుకోవాలి.ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి ప‌ట్టించి.అర గంట త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో శుభ్రంగా వాష్ చేసుకోవాలి.

మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు ఉన్నవాళ్లు దీన్ని తింటే ఏమవుతుందో తెలుసా..?

ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖంపై మృత‌క‌ణాలు, మురికి పోయి.కాంతివంతంగా, అందంగా మారుతుంది.

Advertisement

ఇక ఒక బౌల్ తీసుకుని అందులో బాగా పండిన అర‌టి పండు గుజ్జు, తేనె మ‌రియు పెరుగు వేసి మిక్స్ చేసుకోవాలి.ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసి.

ప‌దిహేను లేదా ఇర‌వై నిమిషాల పాటు బాగా ఆరిపోనివ్వాలి.అనంత‌రం చ‌ల్ల‌టి నీటితో శుభ్రంగా ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల కూడా ముఖం క్ష‌ణాల్లోనే గ్లోగా మారుతుంది.

తాజా వార్తలు