హాలీవుడ్‌ రైటర్స్‌ని వెంటాడుతోన్న ఏఐ ఫోబియా... కారణాలు ఇవే!

ఇపుడు ఇంటర్నెట్ ప్రపంచంలో ఎక్కడ చూసినా చాట్‌జిపిటి గురించే చర్చ.

అవును, ఏఐ జనరేటివ్‌ టూల్స్‌ రాకతో చాలా రంగాల్లో ఇపుడు ఓ రకమైన ఆందోళన మొదలైంది.

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌( Artificial Intelligence ) వలన చాలా మంది ఉద్యోగాలు పోతాయని, జాబ్‌ మార్కెట్‌పై అది తీవ్రమైన ప్రభావం చూపుతుందని చాలామంది నిపుణులు చెబుతున్నారు.ఈ క్రమంలో తాజాగా ఇదే అంశానికి సంబంధించి హాలీవుడ్‌ రైటర్స్‌( Hollywood Writers ) స్టైక్‌ చేయడం ఇపుడు హాట్ టాపిక్ అయింది.

అవును, తమకు పే చేస్తున్న మనీకి సంబంధించిన స్టైక్‌లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌పై వారు ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది.వారి బాధ ఏమిటంటే భవిష్యత్తులో రైటర్స్‌ను ఏఐ భర్తీ చేయవచ్చని కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఏఐ ప్రోగ్రామ్‌లు అనేవి రోజురోజుకూ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రపంచమంతటా ఇలాంటి ఆందోళనలు చెలరేగుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఏఐ వినియోగాన్ని నియంత్రించడానికి రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా( Writers Guild of America ) ఒక బైండింగ్ అగ్రిమెంట్‌ను ప్రతిపాదించింది.

Advertisement

ఇందులో ఏఐ రాసిన ఏదైనా లిటెరసీ లేదా సోర్స్‌ మెటీరియల్‌గా పరిగణించకూడదు, WGA సభ్యులు రాసిన స్క్రిప్ట్‌లను ఏఐకి ట్రైనింగ్‌ ఇవ్వడానికి అనుమతించకూడదు అని పేర్కోవడం విశేషం.కాగా స్టూడియోలు ఈ ప్రతిపాదనను తిరస్కరించడం కొసమెరుపు.బదులుగా టెక్నోలాజికల్‌ అడ్వాన్స్‌మెంట్‌ గురించి చర్చించడానికి సంవత్సరానికి ఒకసారి సమావేశం కావాలని ప్రతిపాదించాయి.

ఇకపోతే కొంతమంది హాలీవుడ్ ఎగ్జిక్యూటివ్‌లు రాబోయే కొద్ది సంవత్సరాలలో ఏఐ మంచి సినిమాలను స్క్రిప్ట్‌ రాయగలదని నమ్ముతున్నారు.అందుకే తమ తదుపరి హిట్ షోలను రాయడానికి, డబ్బును ఆదా చేసుకోవడానికి కంప్యూటర్‌లపై ఆధారపడే అవకాశం ఉందని రైటర్‌లు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

తాజా వార్తలు