తారక్, రామ్ చరణ్‌లకు భయం పుట్టిస్తున్న ఆ హాలీవుడ్‌ సినిమాలు..?

ఈరోజుల్లో ఇండియాలో హాలీవుడ్ సినిమాలు( Hollywood movies) కూడా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాయి.

ఒకప్పుడు ఈ సినిమాలు మన ఇండియన్ సినిమాల కలెక్షన్లపై ఎఫెక్ట్ చూపించేవి కావు.

వాటి రిలీజ్‌లతో సంబంధం లేకుండా మనోళ్లు తమ మూవీలు నిర్భయంగా విడుదల చేసేవారు.కానీ ఇప్పుడు ఈ సినిమాలు చూసి రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు కూడా భయపడుతున్నారు.తారక్, జాన్వీ కపూర్ హీరో హీరోయిన్లుగా "దేవర" మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో వస్తుంది.అయితే ఈ మూవీ మేకర్స్‌కు ఇప్పుడు హాలీవుడ్ సినిమా తలనొప్పిగా మారింది.

సెప్టెంబర్ 27న ఈ మూవీ విడుదల కానుంది.ఆర్‌ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Advertisement

అయితే ఈ సినిమా కలెక్షన్లపై హాలీవుడ్‌ మూవీ "జోకర్ 2" చాలా ప్రభావం చూపించనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.ఏ పుట్టలో ఏ పాము ఉందో ఎవరికి ఎరుక అని అంటున్నారు.

జోకర్ ఫస్ట్ మూవీ వరల్డ్ వైడ్‌గా సూపర్ హిట్ అయింది.ఇండియాలో అది దాదాపు రూ.80 కోట్లు వసూలు చేసింది.దానికి రెండో భాగంగా వస్తున్న జోకర్ 2పై ఇండియాలోనూ భారీ లెవెల్‌లో హైప్స్‌ ఉన్నాయి.

నిజం చెప్పాలంటే ఈ హాలీవుడ్ క్రేజీ మూవీకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.దేవర సినిమాకి జోకర్ పార్ట్ 2( Joker 2) పోటీగా రాలేదని అనడానికి వీల్లేదు.

ఇక చెర్రీ హీరోగా వస్తున్న "గేమ్ ఛేంజర్( Game Changer)" మూవీకి కూడా ఒక ప్రమాదం పొంచి ఉంది.క్రిస్మస్ ఫెస్టివల్ కానుకగా "గేమ్ ఛేంజర్" మూవీ విడుదల చేస్తామని మూవీ టీమ్ ప్రకటించింది.డిసెంబర్ 20 నుంచి 25 మధ్యలో గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్ కావొచ్చు.

Lorem Ipsum Dolor Sit Amet
తెలంగాణ అని చెప్పుకునే విజయశాంతి నిజంగా ఎక్కడ పుట్టి, పెరిగింది

త్వరలోనే ఆ అఫీషియల్ డేట్ ప్రకటించనున్నారు.అయితే ఇదే సమయంలో ఓ హాలీవుడ్ క్రేజీ మూవీ విడుదల కానుంది.

Advertisement

దానిని సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రమోట్ కూడా చేస్తున్నాడు.ఆ హాలీవుడ్ మూవీ మారేదో కాదు "ముసఫా ది లయన్ కింగ్".

ఐదేళ్ల కింద వచ్చిన లయన్ కింగ్ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు.ఆ సినిమా ఇండియాలోనే రూ.200 కోట్లు వసూల్‌ చేసింది.దీని ప్రీక్వెల్ కు మహేష్ బాబు వాయిస్ ఓవర్ అందించారు.

ఇది ఒక ప్రాపర్‌ తెలుగు సినిమాగా డిసెంబర్ 20న రానుంది.ఇది గేమ్ ఛేంజర్ కంటే బాగుంటే తెలుగు సినిమాలను చిత్తు చేయవచ్చు.

తాజా వార్తలు