సంగారెడ్డి జిల్లాలో రామసముద్రం చెరువుకు గండి

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లోని రామసముద్రం చెరువుకు గండి పడింది.గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పొంగి పోర్లుతున్నాయి.

చెరువుకు వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో గండి పడింది.వందల ఎకరాల్లో పంటలు నీట మునిగడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అధికారులు స్పందించి గండిని పూడ్చాలని సమీప గ్రామస్తులు, రైతులు కోరుతున్నారు.రామసముద్రం చెరువు ప్రమాదస్థాయిలో ఉందని అనేక సార్లు అధికారులకు తెలిపినా పట్టించుకోలేదని రైతులు ఆరోపిస్తున్నారు.

సక్సెస్ కోసం ఆ విషయంలో రాజీ పడ్డాను.. నెట్టింట రష్మిక క్రేజీ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు