కాశీలో శవాలను దహనం చేసే ఘాట్ చరిత్ర ఏమిటో తెలుసా..?

మన హిందూ ఆచారం ప్రకారం మానవ జన్మ ఎత్తిన తర్వాత మరణించేలోపు ఒక్కసారైనా కాశీకి వెళ్లాలని చెబుతుంటారు.అదేవిధంగా తీర్థయాత్రలలో కాశీకి ఎంతో ప్రాముఖ్యత ఉంది.

ఈ విధంగా కాశీలో ఉన్న ఆ గంగా నదిలో స్నానం ఆచరించి ఆ పరమేశ్వరుని దర్శించుకోవడం వల్ల ఏడు జన్మల పాపాలు సైతం తొలగిపోతాయని భావిస్తారు.అదేవిధంగా కాశీ చుట్టుపక్కల ప్రాంతాలలో ఎవరైనా మరణించిన కాశీలో దహనసంస్కారాలు చేయటంవల్ల వారి ఆత్మకు శాంతి కలుగుతుందని చాలా మంది భావిస్తారు.

కాశీలో శవాలను దహనం చేయడానికి ప్రత్యేకమైన ఘాట్ ఏర్పడి ఉంది.ఈ దహన సంస్కరణలు చేసే ఘాట్ చరిత్ర ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

కాశీలో మరణించిన వారికి తప్పకుండా ముక్తి లభిస్తుందని చెబుతారు.ఈ కాశీ ప్రాంతంలో ఏ జీవి మరణించిన ఆ జీవి కుడి చెవి పైకి ఉంటుంది.

Advertisement
History Of Important Ghats In Kashi For Cremation, Ghats, Kashi, Ganga River,

ఆ విధంగా మరణించిన వారి కుడి చెవిలో సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు తారక మంత్రం ఉపదేశించి మోక్షాన్ని ప్రసాదిస్తాడని భావిస్తారు.అదేవిధంగా చుట్టుపక్కల ఎక్కడ మరణించిన వారికి దహన సంస్కరణలు కాశీ ఘాట్ లోనే నిర్వహిస్తారు.

ఇక్కడ శవాలకు దహన సంస్కారాలు చేసిన బూడిదతోనే ఆ పరమేశ్వరుడికి అభిషేకం నిర్వహిస్తారు.

History Of Important Ghats In Kashi For Cremation, Ghats, Kashi, Ganga River,

కాశీలో ఉన్నటువంటి ఘట్టాల విషయానికి వస్తే గంగా నది తీరాన 64 ఘట్టాలు ఉన్నాయి.వీటన్నింటిలో కెల్లా అత్యంత ప్రాముఖ్యమైన ఘట్టాన్ని మణికర్ణికా ఘట్టము అని పిలుస్తారు.కాశి చేరుకున్న యాత్రికులు ఈ ఘట్టం లోనే స్నానాలు ఆచరించి ఆ పరమేశ్వరుని దర్శించుకుంటారు.

అదేవిధంగా ఈ ఘాట్ లోనే ఎల్లప్పుడు శవాలను దహనం చేస్తూ ఉంటారు.పురాణాల ప్రకారం ఈ ప్రదేశంలో మహావిష్ణవు తన చక్రముతో ఒక తీర్థాన్ని త్రవ్వి, దాని తీరంలో శ్రీ విశ్వనాధుని గురించి తపస్సు చేసాడు.

Ladies Finger, Reduce Overweight, Overweight, Weight Loss Tips, Benefits Of Ladies Finger For Heal

శ్రీ విశ్వేశ్వరుడు ప్రత్యక్షమై, ఆ తీర్థాన్ని చూసి విఘ్ణ దేవుని తపస్సుకు మెచ్చుకొని అక్కడ విశ్వేశ్వరునిగా వెలిసాడు.ఈ విధంగా శివుడు ప్రత్యేక్షమైన సమయంలో శివుని కుడి చెవికి ఉండే మణి కుండలం జారీ ఆ తీర్థంలో పడటం వల్ల ఆ తీర్థాన్ని చక్రతీర్థం అని పిలుస్తారు.

Advertisement

ప్రస్తుతం ఈ మణికర్ణికా ఘట్టములో ప్రతిరోజు భారీ సంఖ్యలో శవాలకు దహనసంస్కారాలు నిర్వహిస్తారు.

తాజా వార్తలు