ఎన్టీఆర్ వీడియో ఆర్ఆర్ఆర్ మోషన్ పోస్టర్‌లోనే ఉందట

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ సినీ లోకం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాను బాహుబలి చిత్ర సృష్టికర్త రాజమౌళి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులకు తెరలేపుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు.

కాగా ఇటీవల చరణ్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.ఈ ఫస్ట్ లుక్ వీడియోకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

దీంతో తారక్ ఫస్ట్ లుక్ వీడియో ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అయితే ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ గురించిన ఓ క్లూ ఇప్పటికే రిలీజ్ అయిన ఆర్ఆర్ఆర్ మోషన్ పోస్టర్‌లో ఉందని చిత్ర సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి తెలిపారు.

Advertisement

తాజాగా కీరవాణి ఈ విషయం గురించి మాట్లాడుతూ, ఈ సినిమా మోషన్ పోస్టర్‌లో ఎన్టీఆర్ ఫస్ట్ లుక్‌కు సంబంధించి ఓ క్లూ ఉందని, దాన్ని గమనించగలిగితే తారక్ టీజర్ ఎలా ఉంటుందో ఊహించవచ్చని ఆయన అన్నారు.దీంతో ప్రేక్షకులు ఈ చిత్ర మోషన్ పోస్టర్‌ను చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

కాగా మే 20న తారక్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో రిలీజ్ కానున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు