Farmers Delhi Chalo : ఢిల్లీ సరిహద్దులో మరోసారి హైటెన్షన్..!!

దేశ రాజధాని ఢిల్లీ( Delhi ) సరిహద్దులో మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

డిమాండ్ల సాధన కోసం రైతులు మరోసారి ‘ఢిల్లీ చలో( Farmers Delhi Chalo Protest )’ కార్యక్రమానికి పిలుపునిచ్చారు.

ఈ మేరకు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్న రైతన్నలు జంతర్ మంతర్ వరకు ర్యాలీకి సన్నాహాలు చేస్తున్నారు.శంభు వద్ద ప్రస్తుతం కొనసాగుతున్న ఆందోళనలకు పంజాబ్, హర్యానా( Punjab, Haryana ) రైతుల మద్ధతు కొనసాగుతోంది.

కాగా ఇవాళ ఇతర రాష్ట్రాల రైతులు, రైతు సంఘాల నేతలు నిరసనల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

రైతు నేతల ఢిల్లీ ముట్టడి పిలుపు నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు.ఈ క్రమంలోనే సరిహద్దుల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.ఢిల్లి సరిహద్దును బారికేడ్లతో పోలీసులు మూసివేశారు.

Advertisement

అదేవిధంగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్( Rapid Action Force ) రంగంలోకి దిగింది.

ప్రతిరోజు ఉదయం పరిగడుపున నిమ్మరసం తాగుతున్నారా.. అయితే జాగ్రత్త..?
Advertisement

తాజా వార్తలు