తెలంగాణ ప్రభుత్వం పై సీరియస్ కామెంట్లు చేసిన హైకోర్టు..!!

తెలుగు రాష్ట్రాలలో మహమ్మారి కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్న సంగతి తెలిసిందే.

ముఖ్యంగా దేశంలో ఎక్కువ కేసులు నమోదవుతున్న రాష్ట్రంగా మహారాష్ట్ర పక్కనే తెలంగాణ రాష్ట్రం ఉండటంతో అక్కడ పరిస్థితి రోజు రోజుకి ప్రమాదకరంగా మారుతోంది.

ఈ నేపథ్యంలో ఇప్పటికే విద్యా సంస్థల పై మరియు పరీక్షల విషయంలో కీలక నిర్ణయం ప్రభుత్వం తీసుకోవడం జరిగింది.పరిస్థితి ఇలా ఉండగా తాజాగా తెలంగాణ ప్రభుత్వం పై హైకోర్టు సీరియస్ కామెంట్లు చేసింది.

High Court Serious Comments On Telangana State Government , Telangana, High Cour

విషయంలోకి వెళితే కరోనా కేసులు గురించి వివరాలు అడిగినా.తెలంగాణ ప్రభుత్వం నుండి సరైన సమాధానం రాలేదని మండిపడింది.

అసలు ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వారిని ఎందుకు పరీక్షలు చేయటం లేదని ప్రశ్నించింది.పబ్లిక్ గ్యాదరింగ్.

Advertisement

పై చర్యలు ఏమయ్యాయి అని ప్రశ్నించింది.అదేవిధంగా పబ్బులు, క్లబ్బు లపై ఎందుకు ఆంక్షలు విధించ లేదని.

హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.ఆర్టిపిసిఆర్ వివరాలు లేవని.14 అదనపు సెంటర్లకు అనుమతి అన్నారు.ఎప్పుడు, ఎక్కడ, ఏర్పాటు చేస్తారు అంటూ తెలంగాణ ప్రభుత్వం పై సీరియస్ కామెంట్లు చేసింది తెలంగాణ హైకోర్టు.

Advertisement

తాజా వార్తలు