హైకోర్టు సంచలన తీర్పు.. క్రిమిన‌ల్ కేసులో దోషిగా తేలినా వారికి లాభమేనటా.. ?

భ‌ర్త‌ను హ‌త్య చేసిన కేసులో దోషిగా తేలిన బ‌ల్జీత్ కౌర్ అనే మ‌హిళ వేసిన పిటిష‌న్ విచారణ సందర్భంగా, కోర్టు ఈ సంచలన తీర్పును వెల్లడించింది.

ఇంతకు ఆ తీర్పు ఏంటో తెలుసుకుంటే.

హ‌ర్యానా ప్ర‌భుత్వ ఉద్యోగం చేస్తున్న ఒక వ్యక్తిని అతని భార్య అయిన బల్జీత్‌ కౌర్‌ హత్యచేసిందట.ఈ కేసు 2008లో జరిగింది.

ఇకపూర్తి వివరాలు తెలుసుకుంటే.బల్జీత్‌ కౌర్‌ అనే మహిళ 2008లో త‌న భ‌ర్త మ‌ర‌ణించాడ‌ని తెలుపగా, అసలు తన భర్త మరణం సాధారణమైనది కాదని తమ విచారణలో తేలిందని పోలీసులు పేర్కొన్నారు.

బల్జీత్‌ కౌర్‌ 2009లో తన భర్తను హతమార్చిందని, 2011లో ఆమె దోషిగా తేలిందని పిటిషన్‌లో పోలీసులు వెల్లడించారు.ఇక అప్పటి వరకు హ‌ర్యానా ప్ర‌భుత్వం ఆమెకు ఇస్తున్న పెన్ష‌న్, దోషిగా తేల‌డంతో నిలిపి వేసింది.

Advertisement

కాగా తాజా విచార‌ణ‌లో హ‌ర్యానా ప్ర‌భుత్వ ఆదేశాల‌ను తప్పు పట్టిన కోర్టు, బల్జీత్‌ కౌర్‌కు పూర్తి బ‌కాయిల‌తో పాటు పెన్ష‌న్ చెల్లించాల‌ని సంబంధిత శాఖ‌ను ఆదేశించింది.సీసీఎస్‌ రూల్స్‌, 1972 ప్ర‌కారం భ‌ర్త చ‌నిపోయిన త‌ర్వాత భార్య‌కు ఫ్యామిలీ పెన్ష‌న్‌ను ఇస్తారని ఈ సందర్భంగా గుర్తు చేసింది.

అదీగాక భార్య క్రిమిన‌ల్ కేసులో దోషిగా తేలినా ఫ్యామిలీ పెన్ష‌న్ పొందేందుకు అర్హురాలేనని కోర్టు స్ప‌ష్టం చేసింది.

Advertisement

తాజా వార్తలు